- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Saudi Arabia : సౌదీలో తెలంగాణ వాసి హత్య !
సౌదీ అరేబియా(Saudi Arabia)లో తెలంగాణ వాసి(Telangana NRI) తన సహచరుడి చేతిలోనే హత్య(Murder)కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

దిశ, వెబ్ డెస్క్ : సౌదీ అరేబియా(Saudi Arabia)లో తెలంగాణ వాసి(Telangana NRI) తన సహచరుడి చేతిలోనే హత్య(Murder)కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సౌదీ అరేబియాలోని దమ్మాం నగరంలో తెలంగాణ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో నివసించే సికో బిల్డింగ్ ప్రాంతంలో నివాసముండే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండం పోశానిపేట గ్రామానికి చెందిన గుంట హన్మంతు హత్యకు గురయ్యాడు.
హన్మంతుతో పాటు అదే గదిలో ఉంటున్న మరో తెలంగాణ ప్రవాసీయుడికి మధ్య వాగ్వివాదం ఏర్పడగా..తాగిన మైకంలో ఉన్న నిందితుడుగ్గా హన్మంతుపై కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో ఒక భారతీయుడు అందునా తెలుగు ప్రవాసీ హత్యకు గరికావడం ఇదే మొదటిసారి. మృతుడు వీసా గడువు ముగిసి అక్రమంగా దేశంలో ఉంటున్న అతను నిర్మాణ రంగంలో కూలీ పనులు చేసుకొంటున్నాడు.
ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని సమాచారం. కాగా హత్య జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసీయులు వీసా గడువు ముగిసి అక్రమంగా ఉంటున్న నేపథ్యంలో వారిపై కూడా అక్రమ వలసదారులను గుర్తించే క్రమంలో విచారణ చేపట్టగా ఈ వ్యవహారం అటువంటి వారందరికి ఇబ్బందికరంగా మారింది.






