ఐఐటీ బాంబేలో14 రోజులుగా అనుమానాస్పద వ్యక్తి బస

by Shamantha N |

ముంబయిలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో భద్రతా లోపాలు కలకలం రేపుతోంది.

ఐఐటీ బాంబేలో14 రోజులుగా అనుమానాస్పద వ్యక్తి బస
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబయిలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో భద్రతా లోపాలు కలకలం రేపుతున్నాయి. 22ఏళ్ల బిలాల్ అహ్మద్ ఫయాజ్ అహ్మద్ తేలి అనే వ్యక్తి విద్యార్థిగా నటిస్తూ గత 14 రోజులుగా క్యాంపస్‌లో అక్రమంగా నివసిస్తున్న ఘటన వెలుగు చూసింది. జూన్ 17న క్యాంపస్ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకొని పవాయ్ పోలీసులకు అప్పగించారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బిలాల్ హాస్టళ్లలో అనధికారికంగా బస చేస్తూ విద్యార్థులతో కలిసిపోయాడు. విచారణలో అతను జూన్ 2–7 జూన్ 10–17 మధ్య హాస్టళ్లలో ఉన్నట్లు అంగీకరించాడు. ఐఐటీ బాంబేలో సుమారు 13,000 మంది విద్యార్థులు ఉన్న సమయంలో, అతడు లోపలికి ప్రవేశించడంపై భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఘటనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, జూన్ 4న CREST విభాగానికి చెందిన అధికారిణి శిల్పా కోటిక్కల్ తన కార్యాలయంలో అనుమానాస్పదంగా చొరబడిన వ్యక్తిని గమనించారు. అతను ఐఐటీ విద్యార్థి కాదని తెలుసుకున్న తర్వాత అతను అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం కోటిక్కల్ సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రతా విభాగానికి పంపారు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

అదే వ్యక్తిని లెక్చరర్ హాల్ లో గుర్తించడంతో..

జూన్ 17న అదే అధికారి అతన్ని లెక్చర్ హాల్ లో మళ్లీ గుర్తించి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే స్పందించిన గార్డులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బిలాల్‌గా గుర్తించారు. వివిధ హాస్టళ్లలో అక్రమంగా బస చేసినట్టు వెల్లడించాడు. ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 329(3) 329(4) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బిలాల్‌ను అదుపులోకి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కోణాల్లో విచారిస్తున్నారుఐఐటీ క్యాంపస్ సరిహద్దులో ఉన్న పవాయ్ సరస్సు ప్రాంతం నుంచి అతను ప్రవేశించి ఉండే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే తక్షణమే భద్రతా విభాగానికి తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story