- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్లకు సుప్రీం కోర్టు షాక్.. బెంగళూరు దాటి పనిచేయాల్సిందే
బెంగళూరు నంచి తమను బదిలీ చేయొద్దని డాక్టర్లు వేసిన పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు నో చెప్పింది.

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు నంచి తమను బదిలీ చేయొద్దని డాక్టర్లు వేసిన పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు నో చెప్పింది. బెంగళూరు ఆకర్షణీయమైన నగరం కావొచ్చు. కర్ణాటక రాజధాని నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వర్తించడం కూడా వృత్తిలో భాగమేనని చెప్పింది. బెంగళూరు విశ్వనగరం. జీవితం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ కర్ణాటకలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయి. మీరు సమాజంలో ఒక ప్రత్యేక తరగతికి చెందిన వారు. మీరు బదిలీని వ్యతిరేకిస్తే ఇతరులకు ఏమి జరుగుతుంది. మేము అప్పీల్‌ను స్వీకరించడానికి ఇష్టపడటం లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
బదిలీలను సవాల్ చేస్తూ పిటిషన్
కర్ణాటక రాష్ట్ర సివిల్ సర్వీసెస్ వైద్య అధికారులు ఇతర సిబ్బంది బదిలీ నియంత్రణ నిబంధనలు, 2025ను సవాలు చేస్తూ వైద్యుల బృందం పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఇది రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని వైద్య అధికారులు ఇతర సిబ్బంది బదిలీలను నియంత్రిస్తుందని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (వైద్య అధికారులు ఇతర సిబ్బంది బదిలీ నియంత్రణ) 2011 చట్టంలోని సెక్షన్ 12 కింద రాష్ట్ర అధికారాన్ని ఉపయోగించి 2025 నియమాలను రూపొందించారని పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు గతంలోబదిలీలను నిలిపివేయడానికి నిరాకరించింది. సుప్రీంకోర్టు ముందు ప్రభుత్వ వైద్యులు 2025 నిబంధనలను సవాలు చేశారు. ఇవి వైద్యుల బదిలీలను నియంత్రిస్తాయి. ఈ నిబంధనలు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో అమల్లో ఉంటాయి. ఇంతకుముందు కర్ణాటక హైకోర్టు ఈ నిబంధనల అమలును నిలిపివేయడాన్ని నిరాకరించింది. హైకోర్టు ప్రకారం, డ్రాఫ్ట్ నిబంధనల ప్రకటన నుంచి తుది ప్రకటన వరకు గడువు ఉండాల్సిన అవసరం 2011 చట్టంలో లేదని పేర్కొంది.






