- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త భార్యను బరువు తగ్గాలని చెప్పడం నేరం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
భార్యకు ఇచ్చిన డబ్బుల గురించి లెక్క అడగటం క్రూరత్వం కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ కు చెందిన ఓ జంటకు 2016లో

దిశ, వెబ్ డెస్క్: భార్యకు ఇచ్చిన డబ్బుల గురించి లెక్క అడగటం క్రూరత్వం కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ కు చెందిన ఓ జంటకు 2016లో వివాహం జరగ్గా భార్యాభర్తలు ఇద్దరు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాళ్లు. అయితే మూడేళ్ల తరవాత వీరిద్దరూ మనస్పర్ధల కారణంగా దూరం అయ్యారు. దీంతో భార్య తన కుమారుడితో కలిసి హైదరాబాద్ లోని పుట్టింటికి వచ్చేసేంది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో భర్త, అతడి కుటుంబంపై గృహహింస, వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేసింది. కాగా సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. సంసారంలో జరిగే సాధారణ గొడవలను, చిన్న చిన్న కీచులాటలను ఐపీసీ సెక్షన్ 498A కింద నేరంగా పరిగణించలేమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్ తో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
మహిళ ఫిర్యాదులో కుటుంబ ఖర్చుల కోస డబ్బులు ఇచ్చిన ప్రతిసారి భర్త లెక్కలు అడుగుతున్నాడని, తనను, బిడ్డను ఆర్థికంగా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కానీ ఇండియాలోని తల్లిదండ్రలకు మాత్రం లక్షల్లో డబ్బులు పంపుతున్నాడని పేర్కొంది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా సరిగా చూసుకోలేదని, ప్రసవం తరవాత బరువు తగ్గాలని వేధించాడని పేర్కొంది. ఆరోపణలు పరిశీలించిన ధర్మాసనం ఇవి సంసారంలో సాధారణం అని స్పష్టం చేసింది. బరువు తగ్గమని చెప్పడం వ్యక్తిగత గుణాన్ని సూచిస్తాయి తప్ప సెక్షన్ 498ఏ కింద నేరం కాదని తెలిపింది. భార్య ఆరోపణలు నిరాధారంగా ఉన్నయని సర్వోన్నత న్యాయస్థానం ఎఫ్ఐఆర్ ను రద్దు చేసింది.






