Former Canadian PM: భారత్ ను విభజించాలనుకునే వారితో దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని

by Shamantha N |

భారత్ ను విభజించాలనుకునే వేర్పాటువాదు శక్తులతో సంబంధాలను వెంటనే తెంచుకోవాలని కెనడా రాజకీయ పార్టీలకు మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ సూచించారు. కెనడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు

Former Canadian PM: భారత్ ను విభజించాలనుకునే వారితో దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ ను విభజించాలనుకునే వేర్పాటువాద శక్తులతో సంబంధాలను వెంటనే తెంచుకోవాలని కెనడా రాజకీయ పార్టీలకు మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ సూచించారు. కెనడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను విభజించాలనుకునే అరాచక శక్తులకు రాజకీయంగా దగ్గరగా ఉండటం కెనడా–భారత్ బంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఏ పార్టీ అయినా ఈ వేర్పాటువాదులతో సంబంధాలు కొనసాగిస్తే, న్యూఢిల్లీతో సుస్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడటం అసాధ్యమని హార్పర్ పేర్కొన్నారు. తన ప్రధానమంత్రి పదవీకాలంలో అలాంటి శక్తులకు పూర్తి దూరంగా ఉన్నామని గుర్తుచేశారు. ప్రస్తుత పార్టీలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కెనడా- భారత్ బంధం మరింత మెరుగవ్వాలి

కెనడా–భారత్ బంధం గతంలో ఎంతో బలంగా ఉండేదని తిరిగి అదే స్థాయికి రెండు దేశాల మధ్య బంధం పెరిగేలా చూడాలన్నారు. అనవసర ఉద్రిక్తతలను తొలగించుకోవాలని సూచించారు. జిహాదీలు, ఖలిస్థానీల వంటి విభజన శక్తులను ప్రోత్సహించడం పూర్తిగా ఆపాలి. అదే ఇరుదేశాల సంబంధాల పునర్నిర్మాణానికి మార్గం అని స్పష్టం చేశారు.కన్జర్వేటివ్ పార్టీకి చెందిన హార్పర్ 2006 నుంచి 2015 వరకు కెనడా ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో, 1985లో ఖలిస్థానీ ఉగ్రవాదులు ఎయిర్ ఇండియా విమానం ‘కనిష్క’పై చేసిన బాంబు దాడిపై విచారణ జరిపించారు. జస్టిస్ జాన్ మేజర్ నేతృత్వంలోని కమిషన్‌ 2010లో నివేదిక సమర్పించగా, హార్పర్ ప్రభుత్వం అధికారికంగా భారత్‌కు క్షమాపణలు చెప్పింది.

Next Story