బ్రాలను ఇక్కడే విప్పి ఈ ఫెన్సింగ్‌కు ఎందుకు తగిలించి వెళ్తారో తెలుసా..?

by Gopi |
బ్రాలను ఇక్కడే విప్పి ఈ ఫెన్సింగ్‌కు ఎందుకు తగిలించి వెళ్తారో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: అప్పుడప్పుడు మనం చాలా విచిత్రమైన ఆచారాలు, సంప్రదాయాల గురించి వింటుంటాం. అలా వాటి గురించి తెలిసినంక ఎంతో ఆశ్చర్యానికి గురవుతుంటాం. ఇప్పుడు అలాంటి వార్తే మీరు వినబోతున్నారు. అదేమంటే... బ్రాలను ఫెన్సింగ్ కు తగిలించడం. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా, ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే... న్యూజిలాండ్ లో కార్ డ్రోనా ట్రాఫెన్స్ అనే ప్రాంతం టూరిస్ట్ అట్రాక్షన్ గా ఉంది. అయితే, 1998-99 మధ్యలో కొంతమంది బాటసారులు తాము ధరించిన బ్రాలను తీసి ఈ ఫెన్సింగ్ కు తగిలించారంటా. అప్పటి నుంచి అటు నుంచి వెళ్లిన ప్రతి ఒక్కరూ వారి బ్రాలను తీసి ఈ ఫెన్సింగ్ కు తగిలించడం మొదలుపెట్టారంటా. అలా చేయడంతో అక్కడ కొన్ని వేల బ్రాలను ఆ ఫెన్సింగ్ కు తగిలించి కనబడుతుంటాయంటా. ఆ ఫెన్సింగ్ పొడవు 40 మీటర్లు ఉంటుందంటా. విభిన్న రంగులు, సైజుల్లో ఉన్న బ్రాలు దర్శనమిచ్చే ఆ చోటును బ్రా ఫెన్స్ గా పిలుస్తారంటా. అయితే, కొన్నిసార్లు వందల సంఖ్యలో బ్రాలను దొంగలు ఎత్తుకెళ్లేవారంటా. అయినా వాటి సంఖ్య పెరగడమే తప్ప కానీ తగ్గలేదంటా. అయితే, బ్రాల దొంగతనం జరిగినప్పటి నుంచి ఈ ప్రాంతం మరింత పాపులర్ అయ్యిందంటా. దీంతో టూరిస్టుల సంఖ్య రెట్టింప్పయ్యిందంటా. ఇక్కడికొచ్చే మహిళలు ఖచ్చితంగా తాము ధరించిన బ్రాను విప్పి... ఇక్కడ ఫెన్సింగ్ కు వేలాడదీయకుండా వెనుదిరగరంటా. ఇలా ఈ ప్రాంతానికి వచ్చిన పాపులారిటీతో ఈ ప్రాంతం పేరు బ్రాడ్రోనాగా మారిపోయిందంటా.






Also Read....

Unknown Facts : ఇలాంటి చట్టం కూడా ఉందని మీకు తెలుసా ?

అసలు ఆమె గర్భవతి అనే తెలియదు.. కానీ విమానం టాయిలెట్‌లో ప్రసవం

Next Story

Most Viewed