ఈ ఒక్క స్టోరీ చదవండి చాలు... సక్సెస్ మీ ఇంటి తలుపులు తడుతుంది!

by Dishanational1 |
ఈ ఒక్క స్టోరీ చదవండి చాలు... సక్సెస్ మీ ఇంటి తలుపులు తడుతుంది!
X

దిశ, వెబ్ డెస్క్: ఎలన్ మస్క్.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్. ఎందుకంటే ప్రపంచ కుబేరుడు. అంత మాత్రానా ఇతని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమీలేదు. అయితే, అతను ప్రపంచ కుబేరుడు అవ్వడానికి చేసిన కృషి ఏంటి, అతని విజయ రహస్యమేంటి అనేది మీరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రపంచ వ్యాప్తంగా డబ్బున్న వ్యక్తులను మనం చూశాం. కానీ, వాళ్లకు, ఎలన్ మస్క్ కు చాలా తేడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎలన్ మస్క్... రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసో.. పాలకులను కొనేసో.. నాయకులను తన జేబులో పెట్టుకునో కుబేరుడు కాలేదు. సంపాదించిందింతా పోగొట్టుకున్నా కూడా తన కొత్త ఆలోచనలే మళ్లీ అతను నిలబడేలా చేసి రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ గా చేశాయి.


దక్షిణాఫ్రికాలోని పెట్రోరియాలో జూన్ 28, 1971న ఎలన్ మస్క్ జన్మించాడు. చిన్నప్పటి నుంచి మస్క్ డిఫరెంట్ గా ఉండేవాడు. అందరూ చేసిన విధంగా కాకుండా భిన్నంగా చేసేవాడు. మస్క్ తండ్రి ఇంజినీర్ అయినందున వాళ్లింట్లో కంప్యూటర్ తోపాటు చాలా పుస్తకాలు ఉండేవి. ఆ పుస్తకాలను మస్క్ బాగా చదివేవాడు. ఆ పుస్తకాలను చదివే కోడింగ్ నేర్చుకున్నాడు. అది కూడా ఎవరి సహాయం లేకుండా కోడింగ్ నేర్చుకుని బ్లాస్ట్ గేమ్ ను క్రియేట్ చేశాడు. ఇదంతా కూడా కేవలం 12 ఏళ్లకే. ఆ గేమ్ ను 500 డాలర్లకు అమ్మాడు. ఆ గేమ్ ఏంటంటే.. అంతరిక్షంలో మనిషి యుద్ధానికి సంబంధించినది. అయితే, దీనిని బట్టి చూస్తేనే మనకు అర్థమైపోద్దీ అతనికి అంతరిక్షంపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్నది అనేది. అయితే, అతను డిగ్రీ పూర్తయిన వెంటనే కెనడా వెళ్లిపోయాడు.


అతనేమీ పేదరికానికి చెందిన కుటుంబానికి వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా అతను పలు పరిశ్రమల్లో పని చేసి సొంతంగా డబ్బులు సంపాదించుకునేవాడు. ఆ డబ్బులతో యూనివర్సిటీ చదువులను పూర్తి చేశాడు. ఆ తర్వాత 1992లో అతను అమెరికాకు షిఫ్ట్ అయ్యాడు. పెన్సిలివెనియా యూనివర్సిటీలో ఫిజిక్స్, బిజినెస్ చదువుకున్నాడు. అయితే, ఆ సమయంలో తాను ఓ ఇంటిని ఫ్రెండ్స్ తో కలిసి రెంట్ కు తీసుకున్నాడు. అప్పుడు తనకు ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఇంటిని నైట్ క్లబ్ గా మార్చాడు. అలా మార్చడంతో వచ్చిన డబ్బులతో రెంట్ కట్టేవాడు. ఆ తర్వాత స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో సీటు తెచ్చుకున్నాడు. కానీ, అతను రెండురోజులు మాత్రమే యూనివర్సిటీలో ఉన్నాడు.

ఎందుకంటే అప్పటికే ఇంటర్నెట్ రెవల్యూషన్ మొదలైంది. అతడి బుర్రా నిండా బోలెడు ఆలోచనలు ఉండేవి. టైం వేస్ట్ అవుతుందని చెప్పి యూనివర్సిటీ నుంచి బయటకొచ్చాడు. ఆ తర్వాత వాళ్ల నాన్నను కన్విన్స్ చేసి 28 వేల డాలర్లు అంటే.. రూ. 22 లక్షలు తీసుకుని తమ్ముడు కిమ్మాల్ తో కలిసి 1995లో జిప్ 2 అనే ఓ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాడు. 1998లో గూగుల్ వచ్చింది. కానీ, అంతకంటే ముందే ఎలన్ మస్క్ 1995లో జిప్ 2 ను అనే స్టార్టప్ కంపెనీని చేసి మన నిత్య జీవితానికి అవసరాలు తీర్చుకోవడానికి ఇంటర్నెట్ ను నేరుగా వాడుకోవడాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎలన్ మస్క్. అంతేకాదు.. ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉండేవిధంగా ఆ యాప్ లో నూతన ఆవిష్కరణలు చేశాడు. కానీ, ఆ తర్వాత ఆ యాప్ ను అమ్మేశాడు.


ఆ తర్వాత X.Com అనే ఓ స్టార్టప్ ను తీసుకొచ్చి ఆన్ లైన్ బ్యాంకింగ్ ను పరిచయం చేశాడు. అది క్రమంగా పే పాల్ గా మారింది. అయితే, ప్రస్తుతం మనం వాడుతున్న గూగుల్ పే, ఫోన్ పే.. ఇవన్నీ కూడా పే పాల్ ను కాపీ కొట్టినవే. సీఈఓగా అనిపించుకోవాలనే కల కూడా మస్క్ కు ఉండేది. ఆ కోరిక పే పాల్ తో నెరవేరింది. అయితే, ఆ తర్వాత పే పాల్ డైరెక్టర్లంతా కూడా అతడిని తొలగించడం జరిగింది. కానీ, అతని షేర్ మాత్రం ఇప్పటికీ అందులో ఉంది. ఆ తర్వాత అతను నేరుగా అంతరిక్షానికి గురి పెట్టాడు. అంతరిక్షంలో మనుషులు బ్రతికే ఏర్పాట్లు చేయాలని అతని ఆలోచన. అక్కడ ముందుగా ఓ గ్రీన్ హౌజ్ ను ఏర్పాటు చేసి మొక్కలను పెంచాలని అనుకున్నాడు. ఈ క్రమంలో 2001లో మార్స్ ఓయాసిస్ అనే ఓ ప్రాజెక్టు మొదలుపెట్టాడు. అంగారక గ్రహం మీదకు వెళ్లాలంటే రాకెట్లు కావాలి కాబట్టి అతను రష్యా వెళ్లాడు. అక్కడ రాకెట్ల కోసం అడిగితే వాళ్లు ఒక్కో రాకెట్ కు రూ. 65 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో అతను అంత డబ్బు మీకిచ్చే బదులు నేనే తయారు చేస్తానంటూ వారికి ముఖం మీద చెప్పేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అమెరికా వచ్చేశాడు.


ఆ తర్వాత అతను ఒకటి లక్ష్యంగా పెట్టుకున్నాడు. అదేంటంటే.. అత్యంత తక్కువ ధరకే రాకెట్ ను తయారు చేయడం. ఇందుకోసం తన దగ్గరున్న డబ్బుంతా ఖర్చు చేసి స్పేస్ ఎక్స్ అనే కంపెనీని 2002లో స్టార్ట్ చేశాడు. అయితే, అతనికి ఆ రంగంలో ఏ మాత్రం తెలియదు. కానీ, అనుకున్నది సాధించాలనే తపనతో అతను మళ్లీ ఒక విద్యార్థిలాగా మారి పుస్తకాలు పట్టాడు. సైంటిస్టులను, ఇంజినీర్లను అపాయింట్ చేసుకున్నాడు. అలా అతను 2006 నుంచి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. అలా 2006లో తొలి రాకెట్ ను ప్రయోగించడం జరిగింది. అయితే, అది జస్ట్ 33 సెకండ్లలో పేలిపోయి కిందపడిపోయింది. దీంతో పేలింది రాకెట్ కాదు... ఎలన్ మస్క్ అని చెప్పి అందరూ అతడిని చూసి నవ్వారు.


అయితే, అతను ఏ మాత్రం ఫీల్ కాలేదు.. ఆ తర్వాత మళ్లీ పలు రాకెట్లను ప్రయోగించాడు. కానీ, ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు. దీంతో అతను పూర్తిగా దివాలా తీశాడు. ఈ క్రమంలో అతనిపై ఫ్రెండ్స్ సీరియస్ అయ్యేవారు. ఇలాంటి పిచ్చి ప్రయోగాలు నీకు అవసరమా అంటూ సలహాలు ఇచ్చేవారు. గిట్టని వాళ్లు హేళన చేశారు.. మీడియా కూడా అతడిని ఒక జోకర్ గా కథనాలు రాసింది. సరిగ్గా అదే సమయంలో అతని భార్య విడాకులు తీసుకోవడంతో అతను బాగా కృంగిపోయాడు.




చివరగా ఒక్క రాకెట్ ను మాత్రమే ప్రయోగించేందుకు మస్క్ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒకవేళ అది సక్సెస్ కాకపోతే మస్క్ సూసైడ్ చేసుకోవాల్సిందే అనే మాటలు అప్పుడు వినిపించాయి. నిజంగానే అది అప్పుడు అతనికి డూ ఆర్ డై స్విచుయేషన్. కానీ, అతను మొండి మనిషి కదా.. అయినా కూడా రాకెట్ ప్రయోగమే కరెక్ట్ అని నిర్ణయించుకున్నాడు. అలా రిస్క్ చేయడంతో 2008 సెప్టెంబర్ లో సక్సెస్ ఫుల్ గా రాకెట్ ను తక్కువ ఖర్చుతో విజయవంతంగా ప్రయోగించగలిగాడు. అతి తక్కువ ఖర్చుతో మస్క్ రాకెట్ ను ప్రయోగించడంతో అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా అతనికి 1.6 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును అతనికి ఇచ్చింది. అదేవిధంగా ఒకసారి ఉపయోగించిన రాకెట్ ను మళ్లీ ఉపయోగించి సక్సెస్ అయ్యాడు. దీంతో అతడిని ఎవరైతే హేళన చేశారో అదే సైంటిస్టులు ఆశ్చర్యపోయారు.


ఇప్పుడు ప్రైవేట్ రంగంలో రాకెట్లు తయారు చేసే సంస్థ స్పేస్ ఎక్సే. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్ గా ఫాల్కన్ హేవీ చరిత్ర సృష్టించింది. ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి టెస్లా తయారు చేసిన ఓ కారును పంపించాడు. ఆ కారును కూడా ఎలన్ మస్క్ ఆలోచనలోంచి పుట్టిందే. ఆ కారు వెరి వెరీ స్పెషల్. అది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ తో ఆ కారు నడుస్తది. దాని కాలుష్యానికి ఏ మాత్రం హానీ చేయదు. అయితే, దానికి భారీ ధర ఉంటుంది. ఇలా ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా అయ్యాడు. అతని దరిదాపుల్లో ఎవరు కూడా రాకుండా అతను ఎదిగి చూపించాడు. సోలార్ ప్యానెల్ ఉత్పత్తి కంపెనీని కూడా మస్క్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ ప్యానెల్ ఉత్పత్తి కంపెనీ మస్క్ దే.


అదేవిధంగా అతనికి మరో ఆలోచన వచ్చింది. అదేమంటే.. కంప్యూటర్ కు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ను లింక్ చేయాలి అనే ఆలోచన వచ్చింది. దీంతో అతను 2015లో ఓపెన్ ఏఐ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. అందులో భారీగా పెట్టుబడులు పెట్టాడు.అయితే, ఈ మధ్యే సంచలనం సృష్టించిన చాట్ జీపిటీ.. ఈ ఓపెన్ ఏఐ సంస్థ ప్రొడక్టే. 2022లో అది ఒక అద్భుత ఆవిష్కరణ. అయితే, ఈ సంస్థకు ఎలన్ మస్క్ గతంలోనే రిజైన్ చేశాడు. కానీ, ఫండింగ్, డొనేషన్స్ మాత్రం కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా బోరింగ్ అనే ఓ కంపెనీని పెట్టాడు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు. ట్విట్టర్ ను కూడా 2022లో 44 బిలియన్ డాలర్లకు కొనేశాడు. ఇప్పుడు ట్విట్టర్ తో మస్క్ చెడుగుడు ఆడుకుంటున్నాడు. ట్విట్టర్ లో బ్లూ టిక్ కావాలంటే... 8 డాలర్లు ఖాతాదారుల నుంచి వసూలు చేస్తున్నాడు. అయితే, తాను అనుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుకు ట్విటర్ ను ఒక టూల్ గా వాడుకుంటాడు అని అతని గురించి బాగా తెలిసినవాళ్లు చెబుతున్నారు.


మస్క్ కు ముగ్గురు భార్యలు, 10 పిల్లలు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు మృతిచెందాడు. ప్రపంచ కుబేరుడైనా మస్క్ ది చాలా సింపుల్ లైఫ్. ఇప్పటికీ కూడా చాలా సింపుల్ గా లివింగ్ చేస్తూ.. హై థింకింగ్ గా ఉంటాడు.

ఇవి కూడా చదవండి : అంచనాలను దాటిన SBI లాభాలు



Next Story