ఎట్టకేలకు అంతరిక్ష యాత్ర స్టార్ట్.. 41 ఏళ్ల తర్వాత భారతీయుడు రోదసిలోకి

by Shamantha N |   (  Updated:2025-06-25 07:10:50  IST  )

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష పయనం ప్రారంభమైంది. ఆయనతో కలిసి మరో ముగ్గురు అస్రోనట్స్ ను తీసుకుని యాక్సియం-4 (Axiom-4) నింగిలోకి దూసుకెళ్లింది.

ఎట్టకేలకు అంతరిక్ష యాత్ర స్టార్ట్.. 41 ఏళ్ల తర్వాత భారతీయుడు రోదసిలోకి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష పయనం ప్రారంభమైంది. ఆయనతో కలిసి మరో ముగ్గురు అస్రోనట్స్ ను తీసుకుని యాక్సియం-4 (Axiom-4) నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫాల్కన్‌ 9 రాకెట్‌ విజయంతంగా స్పేస్ లోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లింది. మే 29న జరగాల్సిన ప్రయోగం ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడింది. కాగా ఈ ప్రయోగానికి ముందుకు కొన్ని టెక్నికల్ సమస్యలు రాగా వాటిని నాసా టీం పరిష్కరించింది.

28 గంటల సమయం.. 400 కిలోమీటర్ల యాత్ర

అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ చేపట్టగా.. (ఇస్రో), (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. శుభాంశు శుక్లాతో పాటు మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్‌ కపు (హంగరీ), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ- విస్నియెస్కీ (పోలండ్‌) రోదసిలోకి వెళ్లారు. ఈ మిషన్ లో శుభాంశు శుక్లా పైలెట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఎస్ఎస్ కు చేరుకుంటారు. దీనికి 28 గంటల సమయం పడుతుంది. మొత్తం 14 రోజులు వీరు అక్కడ ఉండనున్నారు. నాసా నిర్వహించే అయిదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. ఈ ప్రయోగంతో 41 ఏళ్ల తర్వాత మన వ్యోమగామి ఒకరు రోదసిలోలో అడుగుపెట్టనున్నారు. గతంలో రాకేశ్‌శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఈ తర్వాత అంతరిక్ష ప్రయాణం చేసిన వ్యక్తి శుభాంశు శుక్లానే కావడంతో అందరూ ప్రశంసిస్తున్నారు.

Next Story