Mid-Air : ఆకాశంలో ఎదురెదురుగా రెండు విమానాలు.. ఒక్కసారిగా ట్విస్ట్.. తర్వాత ఏమైంది?

by Ramesh Naini |

గగన తలంలో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Mid-Air : ఆకాశంలో ఎదురెదురుగా రెండు విమానాలు.. ఒక్కసారిగా ట్విస్ట్.. తర్వాత ఏమైంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గగన తలంలో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం లాస్ ఏంజెల్స్‌ హాలీవుడ్ బర్‌బ్యాంక్ (Burbank Airport) ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన (Southwest Airlines) సౌత్‌వెస్ట్ విమానం ఆకాశంలో ప్రయాణిస్తున్న వేళ.. కొద్ది దూరంలో హాకర్ హంటర్ యుద్ధ విమానం అకస్మాత్తుగా ఎదురుగా వచ్చింది. ఇది గమనించిన సౌత్‌వెస్ట్ పైలట్లు తమ విమానాన్ని ఒక్కసారిగా 475 అడుగుల మేర కిందకు దించారు. ఇలా కిందకు దించడం వల్ల విమానంలో భారీగా కుదుపులు సంభవించాయి.

ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలు అయినట్లు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తాజాగా వెల్లడిచింది. అనంతరం గమ్యస్థానం (Las Vegas) లాస్ వెగాస్‌‌లో సురక్షితంగా విమానం ల్యాండ్ అయింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఎదురుగా వస్తున్న విమానం ఢీ కొట్టకుండా పైలట్స్ చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో భారీ ప్రమాదం తప్పినట్లు అయ్యిందని ప్రయాణికులు పైలట్స్‌ను కొనియాడారు. ఇది చూసి తాము ఆశ్చర్యపోయామని కొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు.

Next Story