షాకింగ్ వీడియో.. ఒక్కసారిగా ఊడిన డబుల్‌ డెక్కర్‌ బస్సు పైకప్పు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-23 13:59:50  IST  )

యూకేలోని మాంచెస్టర్ నగరంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.

షాకింగ్ వీడియో.. ఒక్కసారిగా ఊడిన డబుల్‌ డెక్కర్‌ బస్సు పైకప్పు
X

దిశ, వెబ్ డెస్క్: యూకేలోని మాంచెస్టర్ నగరంలో (Manchester) ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) మధ్యాహ్నం సాల్‌ఫర్డ్ ప్రాంతంలోని ఎకల్స్ వద్ద ఓ వంతెనను దాటే క్రమంలో డబుల్‌ డెక్కర్‌ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు వంతెన ఎత్తుకు మించి ఉండటంతో.. దాటేందుకు ప్రయత్నించగా బస్సు పైకప్పు పూర్తిగా ఊడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు15 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు రెండో అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కింద పడినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదం జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌పోర్ట్‌ శాఖ వెల్లడించింది.

Next Story