షాకింగ్.. పార్లమెంట్‌లో తన న్యూడ్ ఫొటోను ప్రదర్శించిన మహిళా ఎంపీ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-03 08:09:26  IST  )

ఇటీవల కాలంలో డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతుండటంతో, ఇది ప్రపంచవ్యాప్తంగా గంభీర సమస్యగా మారుతోంది.

షాకింగ్.. పార్లమెంట్‌లో తన న్యూడ్ ఫొటోను ప్రదర్శించిన మహిళా ఎంపీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో డీప్ ఫేక్ (Deep Fake) వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతుండటంతో, ఇది ప్రపంచవ్యాప్తంగా గంభీర సమస్యగా మారుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ ఈ మాయాజాలానికి అతీతులు కారు. ఆధునిక ఏఐ టెక్నాలజీతో, నిజానికి దగ్గరగా ఉన్న తప్పుడు చిత్రాలు, వీడియోలు తయారు చేసి వ్యక్తిగత గౌరవాన్ని, జీవితాలను తలకిందుల చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మారుస్తూ సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ (Viral) చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, డీప్‌ఫేక్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రపంచానికి తెలియజేయడానికై న్యూజిలాండ్ (Newzealand) పార్లమెంటులో ఎంపీ లారా మెక్ క్లూర్ (MP Laura McClure) ఒక ధైర్యమైన చర్య చేపట్టారు. స్వయంగా తానే డీప్ ఫేక్‌ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన త‌న నకిలీ న్యూడ్ ఫొటోను పార్లమెంట్‌లో ప్రదర్శించారు. మహిళా ఎంపీ చర్యకు తోటి ఎంపీలు ఆశ్చర్యపోయారు.

అయితే, డీప్‌ఫేక్ ద్వారా తాను ఈ ఫొటోను ఎలా క్రియేట్ చేయగలిగారో పార్లమెంటులో వివరించారు. డీప్‌ఫేక్ ద్వారా ఏఐ జనరేటెడ్ ఫొటోలను, వీడియోలను ఈజీగా క్రియేట్ చేయవచ్చు అని తెలిపారు. బ్లర్ చేసిన ఓ న్యూడ్ ఫొటోను ప్రింట్ తీసి తీసుకొచ్చి పార్లమెంట్‌లో ప్రదర్శించారు. ఆ ఫొటో చూస్తే అంతా నిజమే అనుకుంటారని, కానీ అది ఒరిజనల్ ఇమేజ్ కాదని, టెక్నాలజీ ద్వారా చేసిన ఫొటో అని స్పష్టం చేశారు. మెక్ క్లూర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం తయారుచేయడానికి 5 నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టిందని, ఇది డీప్‌ఫేక్‌ల సులభతరమైన సృష్టిని సూచిస్తుందని చెప్పారు. ఆమె, ఇలాంటి టెక్నాలజీని దుర్వినియోగం చేయడం వల్ల యువత, ముఖ్యంగా యువతులు, తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేర్కొన్నారు. ఒక 13 ఏళ్ల బాలిక డీప్‌ఫేక్ లక్ష్యంగా మారి ఆత్మహత్యాయత్నం చేసిన ఉదాహరణను ఆమె ప్రస్తావించారు. ప్రస్తుత చట్టాలను సవరించి, అనుమతి లేకుండా డీప్‌ఫేక్‌లను పంచుకోవడం నేరంగా ప్రకటించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. డీప్‌ఫేక్‌లు వాస్తవ చిత్రాల కన్నా ఎక్కువ హానికరమని, ఎందుకంటే అవి వ్యక్తులను వివిధ అసభ్యకర వీడియోలలో చూపించగలవని చెప్పారు. ఇలాంటి డీప్‌ఫేక్‌ల ప్రభావం కేవలం న్యూజిలాండ్‌కే పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దీని బారిన పడుతున్నారు తెలిపారు.

కాగా, మెక్ క్లూర్ చర్య, డీప్‌ఫేక్‌ల ప్రమాదాలను ప్రజలకు తెలియజేయడంలో చట్టసవరణల అవసరాన్ని హైలైట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇది డిజిటల్ హక్కులను రక్షించడానికి, మహిళల గౌరవాన్ని కాపాడడానికి, సాంకేతిక దుర్వినియోగాన్ని అరికట్టడానికి సమాజం, పాలకులు, చట్టసంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. లా అసోసియేషన్ ప్రకారం ఆన్‌లైన్ డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలు బాధితుల పర్మిషన్ లేకుండా చేసినవి 90 నుండి 95% ఉన్నాయి. బాధితులు మహిళే ఉన్నారు.

Next Story