- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shahid Afridi: షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏం అన్నాడో వింటే ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోవడం ఖాయం భయ్యా!
Shahid Afridi: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచింది.

దిశ, వెబ్ డెస్క్: Shahid Afridi: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఇప్పుడు ఈ విషయంపై పాకిస్థానీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద ప్రకటన చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఈ దాడి తర్వాత, రెండు దేశాల క్రికెటర్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, పాకిస్తాన్ మాజీ కెప్టెన్, లెజెండరీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ప్రతి భారతీయుడి రక్తం మరిగేలా ఓ వివాదాస్పద ప్రకటన చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్‌ను నిందించడాన్ని భారత్ పై విమర్శలు గుప్పించారు.
అఫ్రిది మాట్లాడుతూ..భారతదేశం మరోసారి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు, ప్రతివాదనలకు దిగడం చాలా విచారకరం అని అఫ్రిది ఒక ప్రకటనలో అన్నారు. ఇటువంటి చర్యలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతాయి. అశాంతిని మరింత పెంచుతాయి. నిందలు వేసే ఆటలో పాల్గొనడానికి బదులుగా, సమస్యలను పరిష్కరించడానికి, క్రికెట్‌ను రాజకీయాలకు గురికాకుండా ఉంచడానికి భారతదేశం చర్చల్లో పాల్గొనాలని అఫ్రిది అన్నారు. ఇరు దేశాల మధ్య సఖ్యత కుదరాలంటే రెండు దేశాలు చర్చలు జరపాలన్నారు. హింస, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయన్నారు. రాజకీయ జోక్యం లేకుండా క్రికెట్ కు విముక్తి పొందాలని అందరూ కోరుకుంటున్నారన్నారు.
అఫ్రిది వ్యాఖ్యలపై భారతీయులు మండిపడుతున్నారు. పాకిస్తాన్ వక్రబుద్ధి అఫ్రిది సమర్థించడాన్ని దారుణం అంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్ చేసిందనేది బహిరంగ రహస్యం. అలాంటి పాకిస్తాన్ తో భారత్ ఎలా చర్చలు జరుపుతుందంటున్నారు. పహల్గామ్ లో మరణించినవారి ఆత్మ శాంతి చేకూరాలంటే పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా అఫ్రిది ప్రకటనతో పాకిస్తాన్ ఓపెనర్ గుల్ ఫిరోజా తమ జట్టు కూడా భారతదేశంలో ఆడటానికి ఆసక్తి చూపడం లేదని అన్నారు. అయితే భారతదేశంలో మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, శ్రీవత్స్ గోస్వామి క్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్‌ను పూర్తిగా బహిష్కరించాలని BCCIని డిమాండ్ చేశారు.






