- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. టీచర్‌ను స్కూల్‌లో బంధించి.. చీర, బ్లౌజ్ చింపేసి.. ఆరు గంటలపాటు టార్చర్.. వీధుల్లో నగ్నంగానే..
బంగ్లాదేశ్‌లోని కుమిల్లా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మురాద్ నగర్‌లోని పబ్లిక్ హైస్కూల్ హెడ్ టీచర్ శిఖా రాణి రాయ్‌ను స్కూల్‌లో బంధించి దారుణంగా హింసించారు. అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మొహమ్మద్ బిల్లాల్ హొస్సేన్ ఇదంతా చేయించాడని..

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌లోని కుమిల్లా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మురాద్ నగర్‌లోని పబ్లిక్ హైస్కూల్ హెడ్ టీచర్ శిఖా రాణి రాయ్‌ను స్కూల్‌లో బంధించి దారుణంగా హింసించారు. అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మొహమ్మద్ బిల్లాల్ హొస్సేన్ ఇదంతా చేయించాడని.. ఆరు గంటలపాటు టార్చర్ చేశారని తెలుస్తోంది. శారీరకంగా, మానసికంగా దాడి చేయడంతోపాటు, లైంగిక వేధింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. ఆమె చీర, బ్లౌజ్‌ను చింపేసి.. ఆ ఘటన జరిగాక ఆమెను అలాగే వీధుల్లోకి తీసుకొచ్చారని.. పబ్లిక్‌లో అవమానించారని తెలుస్తోంది. ఇందుకు కారణం ఆమె తన హెడ్ టీచర్ పదవికి రాజీనామా చేయకపోవడమేనని.. ఇందుకు నిరాకరించడం వల్లనే ఎటాక్ జరిగిందనేది సమాచారం. మరికొన్ని సోషల్ మీడియా పోస్టులు ఆమె హిందు కావడం వల్లనే ఇంత దారుణానికి ఒడిగట్టారని చెప్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై భారీ ఎత్తున చర్చించబడుతోంది.






