- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశం ఏర్పడకముందే పుట్టిన వ్యక్తి..142 ఏళ్ల వృద్ధుడు మృతి
సౌదీ అరేబియా దేశం ఏర్పడక ముందే పుట్టిన 142 ఏళ్ల వ్యక్తి కన్నుమూశాడు. నాసర్ బిన్ రదద్ అల్ వదాయి ఆ దేశంలో అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందాడు.

దిశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియా దేశం ఏర్పడక ముందే పుట్టిన 142 ఏళ్ల వ్యక్తి కన్నుమూశాడు. నాసర్ బిన్ రదద్ అల్ వదాయి ఆ దేశంలో అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందాడు. కింగ్ అబ్దుల అజీజ్ నుంచి కింగ్ సల్మాన్ వరకూ అందరురాజుల పాలనను చూసిన వ్యక్తి ఆయన. ఒకసారికాదు రెండుసార్లు కాదు.. ఏకంగా 40 సార్లు హజ్ యాత్ర చేసిన ఆయన ఏడుపెళ్లిళ్లు చేసుకున్నాడు. పిల్లలు, మనుమలు, మనుమరాళ్లంతా కలిపి ఆయనకు 134 మంది వారసులు ఉన్నారు. 110వ ఏట ఏడోసారి పెళ్లి చేసుకున్నాక కూడా తండ్రవ్వడం విశేషం. అతని మూడో భార్య ప్రస్తుత వయసు 110 సంవత్సరాలు. ఆయనతో 30 సంవత్సరాలపాటు దాంపత్యజీవితాన్ని పంచుకుంది.
సౌదీ అధికారుల లెక్కల ప్రకారం నాసర్ 1800ల చివరలో జన్మించారు. మనం దశాబ్దాలుగా మర్పును చూస్తుంటే.. అతను మాత్రం ఒక శతాబ్దకాలంలో చోటుచేసుకున్న మార్పులను చూశాడు. విద్యుత్, ఆస్పత్రుల, చమురు సంపద, ఆధునిక సాంకేతికత అని కళ్లముందే అందుబాటులోకి వచ్చాయి. సౌత్ సౌదీ ఆచారాల్లో పాటించే సాంప్రదాయ ఆహారపు అలవాట్ల కారణంగానే ఆయన ఇన్ని సంవత్సరాలు జీవించి ఉండటానికి కారణమని అక్కడివారు చెప్తున్నారు. అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించేందుకు 7000 మందికిపైగా ధహ్రాన్ అల్ జానౌబ్ లో గుమిగూడారు.






