యెమెన్‌లోని ముకల్లా నగరంపై సౌదీ అరేబియా బాంబుల వర్షం

by Malleboina Mahesh |

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుండి వేర్పాటువాదుల కోసం వచ్చిన భారీ ఆయుధాల చేరవేత‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది.

యెమెన్‌లోని ముకల్లా నగరంపై సౌదీ అరేబియా బాంబుల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుండి వేర్పాటువాదుల కోసం వచ్చిన భారీ ఆయుధాల చేరవేత ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా మంగళవారం యెమెన్‌లోని రేవు పట్టణమైన ముకల్లా (Mukalla) పై వైమానిక దాడులు (Air strikes) నిర్వహించింది. యూఏఈ మద్దతు ఉన్న 'సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్' (STC) దళాలకు ఈ ఆయుధాలు అందుతున్నాయనే పక్కా సమాచారంతోనే ఈ దాడులు చేసినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడులు కేవలం ఆయుధ వాహనాలను లక్ష్యంగా చేసుకుని చేసినవేనని, ఎటువంటి పౌర నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని సౌదీ సైన్యం (Saudi Army) వెల్లడించింది.

ఈ వైమానిక దాడులు రియాద్ (సౌదీ), అబుదాబి (యూఏఈ) మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను సూచిస్తున్నాయి. యెమెన్ యుద్ధంలో ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న ఈ రెండు దేశాలు, ప్రస్తుతం వేర్వేరు వర్గాలకు మద్దతు ఇస్తుండటంతో ఈ సరికొత్త ఘర్షణ చోటుచేసుకుంది. తాజా దాడులపై యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. హద్రమౌత్ ప్రావిన్స్‌లో వేర్పాటువాదులు పట్టు సాధిస్తున్న క్రమంలో జరిగిన ఈ దాడులు మధ్యప్రాచ్యంలో మరోసారి అలజడిని సృష్టిస్తున్నాయి.

Next Story