రాష్ట్రపతి భవన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్.. గౌరవ వందనం, ప్రత్యేక విందు ఏర్పాటు

by Ramesh Naini |

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

రాష్ట్రపతి భవన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్.. గౌరవ వందనం, ప్రత్యేక విందు ఏర్పాటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందుకు ఆయన హాజరయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. పుతిన్‌కు స్వాగతం పలుకుతూ రష్యా, భారత జాతీయ గీతాలను వినిపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరినొకరు తమ దేశాలకు చెందిన ప్రముఖులకు పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. రష్యన్ ప్రముఖులలో రష్యన్ రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ మరియు క్రెమ్లిన్ సహాయకుడు డిమిత్రి పెస్కోవ్ ఉన్నారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు రెండు రోజుల భారత పర్యటనకు వచ్చారు. హైదరాబాద్‌ హౌస్‌ వేదికగా ఇరు దేశాధినేతలు 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలపై వీరు విస్తృతంగా చర్చించారు. ఆహార భద్రత, ఆరోగ్య రంగం, వాణిజ్యం, రక్షణ రంగం, కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌, లేబర్‌ మైగ్రేషన్‌ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంతో పాటు పలు అంశాలపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధాని మోడీ ట్వీట్..

Next Story