- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chernobyl : చెర్నోబిల్ అణుప్లాంట్ పై రష్యా దాడి
ప్రపంచానికి మరో అణుప్రమాదం(Nuclear disaster) ముంచుకు రానుందా? అంటే అవుననే అనిపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచానికి మరో అణుప్రమాదం(Nuclear disaster) ముంచుకు రానుందా? అంటే అవుననే అనిపిస్తోంది. రష్యా- ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య జరుగుతున్న యుద్ధం భారీ అణు ప్రమాదాలకు దారి తీసేలా కనిపిస్తోంది. ఉక్రెయిన్ లోని బెలారస్(Belarus) సరిహద్దుల్లో గల చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్(Chernobyl Nuclear Plant) పై రష్యా డ్రోన్లతో దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ప్లాంట్ పై గల కాంక్రీట్ షెల్టర్ కొద్దిగా దెబ్బతిన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ(Ukraine President Zelensky) ఎక్స్ లో ఓ పోస్టు చేశారు. చెర్నోబిల్ లో దెబ్బతిన్న నాలుగో రియాక్టర్ నుంచి రేడియేషన్ వెలువడకుండా కాపాడుతున్న షెల్టర్ పై రష్యా డ్రోన్లతో దాడి(Russia Drone Attack) చేసిందన్నారు. ఈ ఘటనలో కాంక్రీట్ షెల్టర్ దెబ్బతినగా.. రేడియేషన్ స్థాయి సాధారణంగానే ఉందన్నారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులపై సమీక్ష చేస్తున్నామని తెలిపిన జెలన్ స్కీ.. అయితే న్యూక్లియర్ ప్లాంట్ దాడి తీవ్రత స్థాయి పెద్దదే అన్నారు. రష్యా అధ్యక్షుడు శాంతి చర్చలకు సిద్ధంగా లేరనడానికి ఈ దాడులే నిదర్శనం అని వెల్లడించారు. కాగా 1986లో ఈ ప్లాంట్ లో భారీ పేలుడు జరిగి పెద్ద ఎత్తున రేడియేషన్ వ్యాపించింది. ఉక్రెయిన్ లో జరిగిన ఈ పేలుడు వలన ఏర్పడిన రేడియేషన్ మేఘాలు.. సోవియట్ యూనియన్, ఐరోపాలోని అనేక దేశాల మీదుగా వ్యాపించాయి. లక్షల మంది రేడియేషన్ బారిన పడి క్యాన్సర్ కు గురయ్యారు. దాని ప్రభావం ఇప్పటికీ ఉందంటారు నిపుణులు. ఇక ప్రస్తుతం జరిగిన దాడిపై అంతర్జాతీయ న్యూక్లియర్ సంస్థ (INO)స్పందించింది. నాలుగో రియాక్టర్ పై జరిగిన దాడి నిజమే అని ఖరారు చేసింది. అయితే ఉక్రెయిన్ సంక్షోభంపై జర్మనీలోని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ మొదలు కావడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం అంటూ అంతర్జాతీయ పత్రికలు కథనాలు వెల్లడించాయి.






