- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల విడుదల
రష్యా- ఉక్రెయిన్ (Russia- Ukrain)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే యుద్ధ ఖైదీల మార్పు మొదలైంది. ఇరు దేశాలు యుద్ద ఖైదీలను విడుదల చేశాయి. ఇస్తాంబుల్ లో గత వారం క్రితం రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగాయి

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్ (Russia- Ukrain)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే యుద్ధ ఖైదీల విడుదల మొదలైంది. ఇరు దేశాలు యుద్ద ఖైదీలను విడుదల చేశాయి. ఇస్తాంబుల్ లో గత వారం క్రితం రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగాయి. ఇందులో రెండు దేశాల ఖైదీల విడుదలకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. ఖైదీల విడుదలకు సంబంధించిన వీడియోను రష్యా రక్షణ శాఖ సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. అయితే రెండు దేశాలు ఎంతమంది ఖైదీలను విడుదల చేశాయి అనే స్పష్టత మాత్రం ఇవ్వలేవు. ఖైదీల విడుదల విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ధ్రువీకరించారు. 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బందీలను మార్చుకునేందుకు ఇరువర్గాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
మృతదేహాల తరలింపులో..
మృతదేహాల తరలింపుపై మాస్కో చెత్త గేమ్ ఆడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. ఇప్పటికే 1200 పైగా మృత దేహాలను ఉక్రెయిన్ కు పంపేందుకు ప్రయత్నిస్తుంటే ఉక్రెయిన్ దీనికి సంబంధించి నోరు మెదపడం లేదని రష్యా ఆరోపిస్తుంది. రష్యా చేసిన ఈ ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. రష్యా ఆడుతున్న నాటకాలేనని ఆరోపించింది. ఒక వైపు చర్చలు జరుగుతుండగానే మరో వైపు రష్యా తన దాడులను తీవ్రతరం చేసింది. కీవ్, ఒడెసా, లాంటి నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు. ముగ్గరు మరణించారు. ఉక్రెయిన్ కూడా గత 10 రోజుల కింద మాస్కో నగరంలో డ్రోన్లతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.






