ట్రంప్‌ అసలు రంగు బయటపడింది! ఇరాన్‌పై దాడుల వేళ రష్యా తీవ్ర విమర్శలు

by Ramesh Naini |

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా సైనిక చర్యలకు దిగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

ట్రంప్‌ అసలు రంగు బయటపడింది! ఇరాన్‌పై దాడుల వేళ రష్యా తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా సైనిక చర్యలకు దిగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తనను తాను 'శాంతిదూత'గా అభివర్ణించుకునే ట్రంప్ అసలు రంగు బయటపడిందని రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్, మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ (Dmitry Medvedev) ఘాటు విమర్శలు చేశారు. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో, ఇరాన్‌తో యుద్ధం మొదలైందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై మెద్వెదేవ్ తన 'టెలిగ్రామ్' ఖాతా వేదికగా స్పందిస్తూ అమెరికా తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘శాంతిదూత (ట్రంప్‌) తన నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ఇరాన్‌తో చర్చలు జరుపుతామనడం అంతా కేవలం కంటితుడుపు చర్యే (Cover-up). ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎవరూ నిజంగా ఏ విషయంపైనా చర్చలు జరపాలని అనుకోలేదు.’

పర్షియన్ సామ్రాజ్య చరిత్రతో పోలిక

అమెరికా చరిత్రను ఇరాన్ (పర్షియా) చరిత్రతో పోలుస్తూ దిమిత్రి మెద్వెదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికా ఆవిర్భవించి కేవలం 249 ఏళ్లు మాత్రమే అవుతోంది. కానీ పర్షియన్ సామ్రాజ్యం 2,500 ఏళ్ల క్రితమే స్థాపించబడింది. మరో వందేళ్ల తర్వాత ఏం జరుగుతుందో వేచి చూద్దాం’ అంటూ ఆయన తన సందేశాన్ని ముగించారు. ఇరాన్‌పై దాడికి అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ట్రంప్ లక్ష్యంగా రష్యా చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Next Story