బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్ క్లారిటీ.!

by Dishanational4 |
బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్ క్లారిటీ.!
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అభ్యర్థిగా పోటీ చేసిన రిషి సునాక్ కీలక ప్రకటన చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి ఇటీవల లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. టస్ ప్రధాని పదవి చేపట్టిన 45 రోజులకు ఆమె పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో మరోసారి బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీపై రిషి సునాక్ అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా తాను ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. 'యునైటెడ్ కింగ్‌డమ్ గొప్ప దేశం. కానీ, మనం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. మన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని, మన పార్టీని ఏకం చేసి మన దేశానికి అందించాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed