భారత్ లో రాయిటర్స్ ఎక్స్ అకౌంట్ బ్లాక్

by Shamantha N |

ప్రముఖ అంతర్జాతీయ వార్తా ఏజెన్సీ రాయిటర్స్‌ అధికారిక ఎక్స్‌ అకౌంట్ ని(X handle) భారత్ లో నిలిపివేశారు

భారత్ లో రాయిటర్స్ ఎక్స్ అకౌంట్ బ్లాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ అంతర్జాతీయ వార్తా ఏజెన్సీ రాయిటర్స్‌ అధికారిక ఎక్స్‌ అకౌంట్ ని(X handle) భారత్ లో నిలిపివేశారు. లీగల్‌ డిమాండ్‌ కారణంగా అకౌంట్ ని బ్లాక్‌ చేసినట్లు సమాచారం. అయితే ఈ పరిణామంపై ఇప్పటివరకు రాయిటర్స్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఆ అకౌంట్ లో 'లీగల్‌ డిమాండ్‌ కారణంగా ఈ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేశారు' అనే సందేశం కనిపిస్తున్నది. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఈ మధ్య రాయిటర్స్ కు సంబంధించిన ఇతర ఎక్స్ అకౌంట్స్ రాయిటర్స్ టెక్ న్యూస్, రాయిటర్స్ ఫ్యాక్ట్ చెక్, రాయిటర్స్ పిక్చర్స్, రాయిటర్స్ ఏషియా, రాయిటర్స్ చైనా మాత్రం ఇప్పటికీ భారత్ లో పనిచేస్తున్నాయి. ఇకపోతే, రాయిటర్స్‌ అనేది థామ్సన్‌ రాయిటర్స్‌కు చెందిన న్యూస్‌, మీడియా విభాగం. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 200 ప్రదేశాల నుంచి 2,600 మంది జర్నలిస్టులు సేవలందిస్తున్నారు.

Next Story