- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Madrasa refugees: ఢిల్లీలో మద్రాసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించండి: సీఎం స్టాలిన్
జూన్ 1న జంగ్‌పురాలోని మద్రాసీ శిబిరం కూల్చివేత తర్వాత తలెత్తిన ‘సంక్షోభం’పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాశారు

దిశ, నేషనల్ బ్యూరో: జూన్ 1న జంగ్‌పురాలోని మద్రాసీ శిబిరం కూల్చివేత తర్వాత తలెత్తిన ‘సంక్షోభం’పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. ఈ కూల్చివేత కారణంగా దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న తమిళ నాడుకు చెందిన దాదాపు 370 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని పేర్కొన్నారు. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకె) ఎంపీ టీఆర్ బాలు శుక్రవారం స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రికి స్వయంగా లేఖ అందజేశారు. నరేలాలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఇడబ్ల్యుఎస్) గృహ పథకం కింద 189 కుటుంబాలకు ఫ్లాట్లు కేటాయించగా ఈ వసతి గృహాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేవని, నివసించడానికి పనికిరానివిగా ఉన్నాయని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ 150 మందికి పైగా తమిళ విద్యార్థులకు ఏర్పాట్లు చేయకపోవడాన్ని ఢిల్లీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.
బాధితులకు అండగా ఉంటాం
నరేలా నుంచి దాదాపు 20 కి.మీ దూరంలో ఉన్నఅనేక మంది పునరావాసం పొందిన వారికి రవాణా సౌకర్యాలు లేకపోవడాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం గౌరవప్రదమైన పునరావాసం కల్పించాలని బాధిత కుటుంబాల జీవనోపాధిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి కోరారు. ఢిల్లీ హైకోర్టు గతంలో దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ సమీపంలోని బారాపుల్లా జంగ్ పురా డ్రెయిన్ ఒడ్డున ఉన్న 'మద్రాసి శిబిరం'ను 'చట్టవిరుద్ధం'గా ప్రకటించింది. కాగా శిబిరాల తొలగింపు తర్వాత బాధిత నిర్వాసితులు తమిళనాడులోని వారి స్వస్థలాలకు తిరిగి రావడానికి సహాయం చేస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.






