వేలంలో వందలకోట్లు పలికిన డైనోసర్ శిలాజం.. ఎంతో తెలిస్తే షాకే

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-19 16:02:49  IST  )

సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి డైనోసర్ అస్థిపంజరాన్ని వేలం వేయగా.. దాని విలువ 30.5 మిలియన్ డాలర్లు పలికింది.

వేలంలో వందలకోట్లు పలికిన డైనోసర్ శిలాజం.. ఎంతో తెలిస్తే షాకే
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రతికున్నప్పుడు కాదు.. చనిపోయాకే విలువ తెలుస్తుందంటారు. అయితే ఈ మాటలు డైనోసర్ విషయంలో అక్షర సత్యం కాదు.. పైసల సత్యంగా నిలిచింది. సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి డైనోసర్ అస్థిపంజరాన్ని వేలం వేయగా.. దాని విలువ 30.5 మిలియన్ డాలర్లు పలికింది. న్యూయార్క్ నగరంలో సోథ్ బీ సంస్థ ఇటీవల కొన్ని అరుదైన వస్తువుల వేలం నిర్వహించింది. అందులోనే ఈ డైనోసర్ అస్థిపంజరం కూడా ఉంది. ఊహించని రీతిలో వేలంలో భారీ ధర పలికింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన డైనోసర్ అస్థిపంజరాల్లో ఇది మూడవదిగా నిలవడం విశేషం.

గతేడాది జులైలో జరిగిన వేలంలో అపెక్స్ అనే డైనోసర్ శిలాజం 44.6 మిలియన్ డాలర్లు పలికింది. భారత్ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.380 కోట్లు. తాజాగా వేలంలో అమ్ముడైన డైనోసర్ విలువ మన కరెన్సీలో సుమారు రూ.263 కోట్లు. కాగా.. సెక్యూరిటీ రీజన్స్ వల్ల డైనోసర్ శిలాజాన్ని ఎవరు కొనుగోలు చేశారన్న విషయాన్ని వేలం నిర్వాహకులు వెల్లడించలేదు.

Next Story