ఆకాశంలో ఇంద్ర‌ధ‌న‌స్సు చెట్టుకు అంటుకుంది..! క‌ళ్ల‌ ముందే మ‌హాద్భుతం!!

by Disha Web Desk 20 |
ఆకాశంలో ఇంద్ర‌ధ‌న‌స్సు చెట్టుకు అంటుకుంది..! క‌ళ్ల‌ ముందే మ‌హాద్భుతం!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః అద్భుత‌మైన ఈ ప్ర‌కృతిలో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు ఎన్నో ఉంటాయి. కొన్ని న‌మ్మ‌శ‌క్యం కానివి, కొన్ని న‌మ్మ‌క‌త‌ప్ప‌నివి! సాధార‌ణంగా మ‌న‌మంతా ఆకాశంలో ఇంద్ర‌ధ‌నుస్సును చూసే ఉంటాము. రంగురంగుల హ‌రివిల్లు మ‌నస్సుకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. మ‌రి ఈ రెయిన్‌బో దివి నుండి భువికేగితే..?! మ‌న క‌ళ్ల‌ముందే క‌నిపిస్తే.. మ‌నం దాన్ని తాక గ‌లిగితే..?! ఆలోచ‌నే అద్భుతంగా ఉంది క‌దా!! ఆ రెయిన్‌బో కాంతి కిర‌ణాల‌న్నీ ఓ చెట్టుకు అంటుకున్న‌ట్లుండే "రెయిన్బో యూకలిప్టస్" అనే చెట్టు గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాము. దీనిని యూకలిప్టస్ డెగ్లుప్టా అని కూడా పిలుస్తారు.

ఇది ప్రపంచంలోనే అత్యంత రంగులు అద్దుకున్న‌ చెట్టుగా పేరుగాంచింది. ఈ చెట్టుకున్న‌ బెరడు ఏడాదిలో ప్ర‌తి సీజ‌న్‌లోనూ పెచ్చులు రాలి లోప‌ల ఇంద్ర‌ధ‌నుస్సు రంగులు క‌నిపిస్తాయి. రెయిన్‌బో యూకలిప్టస్ ప్రధానంగా హవాయి, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పాపువా న్యూ గినియా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద, విశాలమైన సతత హరిత చెట్టుగా, ఉత్తర అర్ధగోళానికి చెందిన ఏకైక యూకలిప్టస్ జాతిగా గుర్తించ‌బ‌డింది. ఈ చెట్టు పెరిగే కొద్దీ దాని రంగులు మ‌రింత మెరుగుప‌డుతూ, మ‌రింత కాంతివంతంగా త‌యార‌వుతాయి. చెట్టు మొద‌లు ఆర‌డుగుల వ్యాసం వ‌ర‌కూ పెర‌గ‌గ‌ల‌దు, అలాగే, 200 అడుగుల కంటే పైగా ఎత్తు ఎద‌గ‌నూ గ‌ల‌దు. వేసవిలో రెయిన్‌బో-హ్యూడ్ బ్లూస్, రెడ్స్, ఆరెంజ్, పర్పుల్-బ్రౌన్‌లుగా మారుతుంది. దాని సహజ నివాస స్థలంలో 250 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెర‌గ‌గ‌లిగే ఈ చెట్టు పెంచుకుంటే 100-125 అడుగుల ఎత్తును మాత్రమే పెరుగుతుంది. దీన్ని పల్ప్‌వుడ్‌కు అద్భుతమైన మూలకంగా, తెల్ల కాగితం తయారీలో ప్రధాన పదార్ధంగా వాడ‌తారు. ఈ చెట్టులో ఉన్న మరొక అద్భుతం, ఇది అన్ని ఆకారాలు, పరిమాణాలు, రంగులలో పెరుగుతుంది.

Next Story

Most Viewed