ఆఫ్గనిస్థాన్‌లో బహిరంగ శిక్ష.. 80వేల మంది ముందు నిందితున్ని కాల్చిచంపిన 13 ఏళ్ల బాలుడు

by Ajay Maddhiboyina |

తాలిబన్ కంట్రీ ఆఫ్గనిస్తాన్‌లో ఓ దోషికి బహిరంగంగా తాలిబన్ పోలీసులు శిక్షవేశారు.

ఆఫ్గనిస్థాన్‌లో బహిరంగ శిక్ష.. 80వేల మంది ముందు నిందితున్ని కాల్చిచంపిన 13 ఏళ్ల బాలుడు
X

దిశ, వెబ్ డెస్క్: తాలిబన్ కంట్రీ ఆఫ్గనిస్తాన్‌లో ఓ దోషికి బహిరంగంగా తాలిబన్ పోలీసులు శిక్షవేశారు. మంగళ్ అనే నిందితుడు 13మందిని దారుణంగా హత్య చేశాడు. చంపినవారిలో 9మంది పిల్లలు సహా మొత్తం 13 మంది ఉన్నారు. ఈ కేసులో మంగళ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్ఘన్ సుప్రీం నాయ‌కుడు హిబ‌తుల్లా ఆదేశాలతో 80 వేల మంది ముందు 13ఏళ్ల బాలుడికి తుపాకీ ఇచ్చి పోలీసులు కాల్పించారు. మంగ‌ళ్ హ‌త్య చేసిన‌వారిలో ఆ బాలుడి తండ్రి అబ్దుల్ కూడా ఉన్నాడు.

శిక్ష అమ‌లు చేసే ముందు క్ష‌మాభిక్ష కోర‌గా బాలుడు నిరాక‌రించ‌డంతో అత‌డితోనే నిందితుని గుండెల్లో తూటాలు దింపించారు. ఇదిలా ఉంటే 2021లో తాలిబ‌న్లు అధికారంలోకి రాగా అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 10 మందికి బ‌హిరంగ ఉరిశిక్ష‌లు విధించారు. ఇది ష‌రియా చ‌ట్టంలోని క‌ఠిన‌మైన‌ శిక్ష‌ల‌కు చూపే విధంగా ఉంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీంతో తాలిబన్ల నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. 9మంది అమాయ‌క బాల‌ల‌ను చంపిన‌వాడికి ఈ భూమిపై బ‌తికే హక్కులేద‌ని తాలిబ‌న్లు అమ‌లు చేసిన శిక్ష‌ను ప‌లువురు స‌మ‌ర్థిస్తున్నారు.

Next Story