భారతీయుడిగా గర్వంగా ఉంది.. అంతరిక్ష యాత్ర నుంచి శుభాంశు శుక్లా మెసేజ్

by Shamantha N |   (  Updated:2025-06-25 10:08:12  IST  )

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, ఫ్లోరిడా నుంచి విజయవంతంగా యాక్సియమ్ మిషన్-4 స్పేస్‌క్రాఫ్ట్‌లో 41 ఏళ్ల తరువాత అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడిగా నిలిచారు.

భారతీయుడిగా గర్వంగా ఉంది.. అంతరిక్ష యాత్ర నుంచి శుభాంశు శుక్లా మెసేజ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, ఫ్లోరిడా నుంచి విజయవంతంగా యాక్సియమ్ మిషన్-4 స్పేస్‌క్రాఫ్ట్‌లో 41 ఏళ్ల తరువాత అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడిగా నిలిచారు. కాగా ఆయన అంతరిక్షం నుంచి తన మొదటి సందేశంలో ‘జై హింద్, జై భారత్’ అని ఉత్సాహంగా మెసేజ్ పంపాాారు. ‘నా ప్రియమైన భారతీయులరా చాాల ఏళ్ల తర్వాత మనం అంతరిక్షంలోకి చేరాం’ అని అన్నారు. ఈ అద్భుత ప్రయాణంలో నా భుజంపై త్రివర్ణ పతాకం ఉంది. దాన్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంది ఉందన్నారు. ఇది భూమి చుట్టూ 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నామని చెప్పారు. కోట్ల మంది కలలను నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

మాటల్లో చెప్పలేని అనుభూతి: శుభాంశు శుక్లా తల్లి

ఈ మిషన్ లో గ్రూప్ కెప్టెన్ శుక్లా ఉన్నారు. 1984లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడైన స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా గుర్తింపు పొందారు. రాకేష్ శర్మ 1984 ఏప్రిల్ 3న అప్పటి సోవియట్ యూనియన్ నిర్వహించిన స్పేస్ యాత్రలో వెళ్లారు. కాగా శుభాంశు శుక్లా తల్లి మాట్లాడుతూ.. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి అన్నారు. శుభాంశు గురించి ఎలాంటి భయం లేదు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా గర్వంగా ఉంది అని అన్నారు. మీ ప్రయాణం చాలా గర్వంగా ఉందని ప్రపంచమంతా ఒకే కుటుంబమని నిరూపించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాంశు శుక్లాను కొనియాడారు. కోట్ల మంది భారతీయుల కలలు, కోరికలు, ఆకాంక్షలను శుభాంశు శుక్లా మోసుకెళ్లారని ప్రధాని మోడీ ప్రశంసించారు.

Next Story