Wildfires: అమెరికా తగలబడుతుంటే.. మంటల్లో చలి కాచుకుంటున్న ఆల్‎ఖైదా మద్దతుదారులు

by Vennela |

Wildfires: అమెరికా తగలబడుతుంటే.. సోషల్ మీడియాలో మాత్రం కొందరు ఆనందిస్తున్నారు. పాలస్తీనా ఉసురు తగిలే..అమెరికా నాశనం అయితుందంటూ పోస్టులు పెడుతున్నారు.

Wildfires: అమెరికా తగలబడుతుంటే.. మంటల్లో చలి కాచుకుంటున్న ఆల్‎ఖైదా మద్దతుదారులు
X

Wildfires: అమెరికాలో కార్చిచ్చు(Wildfires) విలయం సృష్టిస్తోంది. సంపదతో తులతూగిన లాస్ ఏంజెలెస్(Los Angeles) నగరం బుగ్గి అయ్యింది. సంపన్నుల నగరంగా పేరొందిన లాస్ ఏంజెల్స్ నగరం కాలిబూడిదైపోతోంది. ఈ ప్రాంతంలో హాలీవుడ్ స్టార్స్(Hollywood Stars) తోపాటు బిలియనీర్లు ఎక్కువగా నివసిస్తుంటారు. దీంతో మంటల్లో ఖరీదైన ఇళ్లు, కార్లు, ఇతర వస్తువులు కాలి బూడిదవుతున్నాయి. ఈ కార్చిచ్చులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(US President Joe Biden) కుమారుడు హంటన్ బైడెన్(Hunter Biden) నివాసం కూడా కాలి బూడిదైంది. మాలిబులోని హంటర్ బైడెన్ కు చెందిన అత్యంత విలాసవంతమైన మాన్షన్(Mansion) దగ్ధమైంది. అటు బిలియనీర్లు నివసించే పసిఫిక్ పాలిసేడ్స్(Pacific Palisades) తో పాటు పలు చోట్ల కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఇప్పటి వరకు పది మంది మరణించినట్లు సమాచారం. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. 3వేలకు పైగా విస్తీర్ణంలో ఉన్న 10వేలకు పైగా ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి. వెయ్యికిపైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. 30వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు లాస్ ఏజెంల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ ఆంటోని మార్రోస్(Anthony Marros) తెలిపారు. దాదాపు 50 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తూన్నారు.

అయితే అమెరికా మంటల్లో తగలబడుతుంటే.. కొందరు పాలస్తీనా మద్దతుదారులు(Palestinian supporters) మాత్రం సోషల్ మీడియా (Social media)వేదికగా రెచ్చిపోతున్నారు. అమెరికాలో కార్చిచ్చు తమ శాపమే అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. 50వేల మంది పాలస్తీయన్లను పొట్టనపెట్టుకున్నఅమెరికాకు తమ ఉసురు తగిలిదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. గత 4ఏళ్ల బైడెన్ పాలన(Biden administration)లో పాలస్తీనాపై ఇజ్రాయెల్(Israel) దాడులు ఎక్కువయ్యాయి. అమెరికా అండతోనే ఇజ్రాయెల్ దాడులు చేస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Israeli Prime Minister Netanyahu)కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(International Criminal Court) అరెస్టు వారెంట్లు జారీ చేసినా ఆ దేశం మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇదంతా కూడా అమెరికా కన్నుసైగల్లోనే జరుగుతుందని పాలస్తీయన్లు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికాలో కార్చిచ్చు(Fire in America) బీభత్సం సృష్టిస్తోంది. పాలస్తీయన్ల శాపం తగిలే అమెరికా కాలిబూడిదైతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదంతా దేవుడి శాపమే అంటూ పాలస్తీనా మద్దతుదారులు(Palestinian supporters) అంటున్నారు. ఇదే అదనుగా భావించి అటు అల్ ఖైదా(Al Qaeda) కూడా మరింత విద్వేషాన్ని వెళ్లగక్కుతోంది. కార్చిచ్చులో చనిపోయింది సామాన్యులు.. తగలబడింది కూడా సామాన్యుల సంపద..కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం బైడెన్ కు లింక్ పెడుతూ పైశాచిక ఆనందం పొందడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

Next Story