మరోసారి ట్రంప్ నిర్ణయానికి మద్దతు తెలిపిన ప్రధాని మోడీ

by Malleboina Mahesh |

భారత ప్రధాని నరేంద్ర మోడీ గాజాలో శాంతి స్థాపన దిశగా జరుగుతున్న తాజా పరిణామాలపై ఎక్స్ వేదికగా మరోసారి స్పందించారు.

మరోసారి ట్రంప్ నిర్ణయానికి మద్దతు తెలిపిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) గాజాలో శాంతి స్థాపన దిశగా జరుగుతున్న తాజా పరిణామాలపై ఎక్స్ వేదికగా మరోసారి స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికను స్వాగతిస్తూ.. బందీల విడుదల సంకేతాలు ఒక ముఖ్యమైన ముందడుగు అని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అందులో “శాశ్వతమైన, న్యాయమైన శాంతి కోసం భారత్ అన్ని ప్రయత్నాలకు గట్టి మద్దతు ఇస్తూనే ఉంటుంది” అని మోడీ స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌ను ట్రంప్ స్వయంగా రీపోస్ట్ చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఈ పరిణామం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు మోడీ వైఖరిని విమర్శిస్తూ, స్వతంత్రమైన స్థానం తీసుకోకుండా ట్రంప్ వైపు మద్దతు చూపడం నైతిక బలహీనత అని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ ఈ ప్రణాళికను మద్దతు ఇస్తూ, శాంతి ప్రయత్నాల్లో ముందడుగు వేసినట్లు తెలిపారు. హమాస్ ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా, అంతర్జాతీయంగా ఈ ప్రణాళికకు మద్దతు లభించడం గాజా సమస్య పరిష్కారానికి ఒక కొత్త దారిని సూచిస్తోంది.

Next Story