- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని మోడీ..ఎప్పుడంటే
ఇజ్రాయెల్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండనుంది. ఫిబ్రవరి 25, 26 తేదీలలో ఇజ్రాయెల్ దేశంలో పర్యటిస్తారు.

PM Modi to visit Israel on February 25-26, his second trip in three terms
దిశ, వెబ్ డెస్క్: భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దేశభద్రతను పెంపొందించేలా అడుగులు వేస్తున్నారు. దీనికోసం కలిసి వచ్చే అన్ని దేశాలతో ఒప్పందలు కుదుర్చుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi). ఇందులో భాగంగానే వరుసగా విదేశీ పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇండియాకు ఏది కావాలో దానిని అందించే ప్రయత్నం చేస్తున్నాను ప్రధాని నరేంద్ర మోడీ. ఏజ్ పైబడినప్పటికీ కూడా దేశం కోసం 24 గంటలు పని చేస్తున్నారు. అయితే అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెలలో ఇజ్రాయెల్ లో ( Israel ) ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు.
ఇజ్రాయెల్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన
వరుస విదేశీ పర్యటనలతో దూసుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఫిబ్రవరి 25, 26 తేదీలలో ఇజ్రాయెల్ దేశంలో పర్యటిస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఈ పర్యటన నేపథ్యంలో డిఫెన్స్ రంగంలో సహకారం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ( Benjamin Netanyahu ) ప్రధాని మోడీ చర్చిస్తారట. అలాగే వ్యవసాయ ఆవిష్కరణలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరగని ఉందని ఈ సమాచారం. ఈ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం కూడా ఇవ్వనున్నారు. కాగా 2017 తర్వాత మళ్లీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నారు మోడీ. దీంతో ఈ పర్యటనపై ఆసక్తి నెలపొంది.






