మా వాళ్లను చూపించండి: విమాన ప్రమాద బాధిత కుటుంబాల ఆర్తనాదాలు

by Vemula.Srinu Prasad |

గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో విమానం కుప్పకూలిపోయింది....

మా వాళ్లను చూపించండి: విమాన ప్రమాద బాధిత కుటుంబాల ఆర్తనాదాలు
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు (Ahmadabad Airport) సమీపంలో విమానం కుప్పకూలిపోయింది.ఎయిర్ పోర్టు నుంచి ఫ్లైయింగ్ అయిన కొద్దిసేపటికే స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్‌ను ఢీకొట్టింది. ఈ సమయంలో ప్రయాణికులు 243 మంది ఉన్నారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు అందిస్తున్నారు. పలువురు మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారందరినీ స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు.

అయితే ఈ ఘటనతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాద తీవ్రత భారీగా ఉండటంతో తమ వారికి ఏమైందోనని ఆవేదన చెందుతున్నారు. గుండెలు బాదుకుంటూ సివిల్ ఆస్పత్రి(Civil Hospital) వద్దకు భారీగా చేరుకున్నారు. తమ వారిని చూపించాలంటూ, ఆస్పత్రి లోపలికి అనుమతించాలని సిబ్బందిని వేడుకుంటున్నారు. ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story