- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Plane crash: విమాన ప్రమాదం.. డీఎన్ఏ టెస్టులతో డెడ్ బాడీల గుర్తింపు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో 12న ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి డెడ్ బాడీల గుర్తింపు కొనసాగుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో 12న ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి డెడ్ బాడీల గుర్తింపు కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల డీఎన్ఏతో పోల్చుకుంటూ డెడ్ బాడీలను అప్పగిస్తున్నారు. డీఎన్ఏతో గుర్తించిన 14 డెడ్ బాడీలను ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు బీజీ మెడికల్ కాలేజీ వైద్యులు పేర్కొన్నారు. ఎలాంటి డీఎన్ ఏ టెస్టులు లేకుండా ఎనిమిది డెడ్ బాడీలను వారి కుటుంబ సభ్యులు గుర్తుపట్టడంతో అప్పగించినట్లు వైద్యులు తెలిపారు. విమాన ప్రమాద సమయంలో ఎక్కువగా వేడి పుట్టడంతో శరీర భాగాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఒక్కో పరీక్ష చేయడానికి చాలా సమయం పడుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. మొత్తం ఈ టెస్టుల కోసం 230 బృందాలు పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 11 మంది విదేశీ ప్రయాణికుల మృతదేహాలను గుర్తించి వారికి సమాచారం చేరవేసినట్లు పేర్కొన్నారు.
కష్టంగా మారిన డెడ్ బాడీల గుర్తింపు
ప్రమాదం జరిగిన సమయంలో 1000 డిగ్రీల ఉష్ణోగ్రత పుట్టడంతో ఆ ప్రాంతంలో డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు 1.20 లక్షల ఇంధనం లీక్ అయినట్లు కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోగా.. డీఎన్ఏ టెస్టు చేయడంలో కూడా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఇప్పటి వరకు చనిపోయిన 32 మంది డీఎన్ఏ ఆయా కుటుంబ సభ్యుల డీఎన్ఏతో సరిపోయినట్లు బీజే మెడికల్ కాలేజీ సీనియర్ డాక్టర్లు చెప్పారు. కాగా ఈ ఘటనలో చనిపోయిన గుజరాత్ సీఎం బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపాణీ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యుల డీఎన్ఏతో సరిపోలడంతో డెడ్ బాడీని అప్పగించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు.






