- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబైలో ‘కబూతర్ ఖానా’ల మూసివేత.. కారణమేమిటంటే
ముంబైలో ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న దృష్ట్యా నగరంలో ఉన్న పావురాలకు ఆహారం పెట్టే ప్రదేశాలు 'కబూతర్ ఖానాలు'ను తక్షణమే మూసివేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)కి మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలో ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న దృష్ట్యా నగరంలో ఉన్న పావురాలకు ఆహారం పెట్టే ప్రదేశాలైన 'కబూతర్ ఖానాలు'ను తక్షణమే మూసివేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)కి మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శివసేన నేత నామినేటెడ్ ఎమ్మెల్సీ మనీషా కయాండే శాసన మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తింది. ఆమె పావురాల విసర్జన, ఈకలు వల్ల స్థానిక నివాసితులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని వివరించారు. బీజేపీ నేత చిత్రా వాఘ్ తన అత్త ఈ కారణంగానే శ్వాస సమస్యలకు గురై మరణించిందని తెలిపారు.
నగరంలో 51 కబూతర్ ఖానాలు..
ఈ ఆరోపణలపై స్పందించిన మంత్రి ఉదయ్ సమంత్, నగరంలో ప్రస్తుతం 51 కబూతర్ ఖానాలు ఉన్నాయని వెల్లడించారు. వీటిని మూసివేసే ముందుగా ఒక నెలలోపు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని BMCకి సూచించారు. ‘పావురాలకు ఆహారం పెట్టడం ఒక ఆధ్యాత్మిక చర్య అనే అపోహ ఉంది. కానీ, ఇది ఆరోగ్యపరమైన తీవ్రమైన సమస్యలకు దారితీస్తోంది. గిర్గాం చౌపట్టి వంటి ప్రాంతాల్లో పావురాలు ఫాస్ట్‌ఫుడ్ తినడం వల్ల వాటికే కాదు, మనుషులకు కూడా ప్రమాదం పెరుగుతోంది’ అని సమంత్ వ్యాఖ్యానించారు. గతంలో మూసిన కొన్ని కబూతర్ ఖానాలు తిరిగి ప్రజలు కొంతకాలం తర్వాత తెరిచారని ఆయన గుర్తు చేశారు.
ప్రజలు మద్దతివ్వాలి
శాంతాక్రూజ్ తూర్పు, దౌలత్ నగర్‌లోని అనధికార కబూతర్ ఖానాలను ఇప్పటికే మూసివేశామన, అక్కడి స్థలాలను ట్రాఫిక్ దీవులు మియావాకి తోటలుగా అభివృద్ధి చేశామని షిండే లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ప్రభుత్వ అధికారులు ప్రజలను ఈ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలన్నారు. పావురాలకు బహిరంగంగా ఆహారం పెట్టే ఆచారాన్ని విరమించుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి లాభాలు ఉంటాయని తెలియజేశారు.






