- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakistani spy arrested in Punjab: పాక్ గూఢచారి పంజాబ్ లో అరెస్ట్.. ఐఎస్ఐ, ఖలిస్థానీ టెర్రరిస్టులతో సంబంధాలు
పాకిస్తాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐతో పాటు ఖలిస్థానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంబంధాలు కలిగి, భారత ఆర్మీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేసిన గగన్‌దీప్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు (panjab poice) అరెస్ట్ చేశారు.

దిశ, నేషనల్ డెస్క్: పాకిస్తాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐతో పాటు ఖలిస్థానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంబంధాలు కలిగి, భారత ఆర్మీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేసిన గగన్‌దీప్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు (panjab poice) అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ మంగళవారం వెల్లడించారు. గగన్‌దీప్ సింగ్ గత అయిదేళ్లుగా పాకిస్తాన్‌లో ఉన్న గోపాల్ చావ్లాతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ, అతని ద్వారా ఐఎస్‌ఐ గూఢచారులతో పరిచయాలు పెంచుకున్నాడు. భారత సైనిక కదలికలు, దళాల మోహరింపు, వ్యూహాత్మక ప్రాంతాల సమాచారం అతి సున్నితమైన విషయాలను పాకిస్తాన్‌కు చేరవేశాడు. అతని వద్ద స్వాధీనం చేసుకున్న మొబైల్ లో 20కి పైగా ఐఎస్‌ఐ విదేశీ కాంటాక్టుల సమాచారాన్ని పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్‌లో పలు ముఖ్యమైన వివరాలు, భారత భద్రతా వ్యవస్థలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు గూఢచారిగా గగన్ దీప్ సింగ్ పనిచేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన చర్యల సమయంలో కీలక సమాచారం విదేశాలకు గగన్ దీప్ సింగ్ చేరవేశాడు.
గూఢచార నెట్ వర్క్ పై ముమ్మర దర్యాప్తు
ఇటీవలి కాలంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న గూఢచార నెట్‌వర్క్‌పై ఫోకస్ పెట్టారు. హర్యానాకు చెందిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ జ్యోతి మల్హోత్రా (jyoty malhotra), పంజాబ్‌కు చెందిన గుజాలా, ఓ సీఆర్పీఎఫ్ జవాన్ కూడా గూఢచార ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. పోలీసులు గగన్‌దీప్ సింగ్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, టెక్నికల్ డేటా పై విచారణ జరుపుతున్నారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంత మంది ఉన్నారు. జాతీయ భద్రతా విషయాలను ఏ మేరకు పాకిస్థాన్ కు చేరవేశారనే వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.






