ఇరాన్ క్షిపణి దాడులు..అబుదాబిలో పాకిస్తాన్‌ వ్యక్తి మృతి

by velandi.Saikiran |

ఇరాన్ క్షిపణి దాడుల నేప‌థ్యంలో అబుదాబిలో పాకిస్తాన్‌ వ్యక్తి మృతి చెందాడు.

ఇరాన్ క్షిపణి దాడులు..అబుదాబిలో పాకిస్తాన్‌ వ్యక్తి మృతి
X

దిశ‌, వెబ్ న్యూస్‌: ఇరాన్ ను టార్గెట్ చేసి అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ కు సంబంధించిన రక్షణ మంత్రి అమీర్ కూడా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు గట్టిగానే ఇరాన్ కూడా కౌంటర్ ఇస్తోంది. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి కౌంటర్ ఎటాక్ చేస్తోంది ఇరాన్. ఇందులో భాగంగానే అబుదాబీ పైన కూడా క్షిపణి దాడి జరిగింది. అయితే ఇరాన్ చేసిన క్షిపణి దాడి నేపథ్యంలో అబుదాబీలో ఓ పాకిస్తాన్ పౌరుడు మృతి చెందాడు.

ఈ విషయం జాతీయ మీడియాలో కూడా వచ్చింది. ఇదే సంఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అబుదాబీలోని జనాలు ఉన్న ప్రాంతంలోనే ఇరాన్ వేసిన క్షిపణి పడింది. దీంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే పాకిస్తాన్ వ్యక్తి మరణించిన నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. గల్ఫ్ దేశాలలో ఉన్న తమ పౌరులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచనలు చేస్తోంది.

పాకిస్తాన్ ప్రధాని రియాక్షన్ ఇదే

గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తీవ్రంగా ఖండించారు. యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. అబుదాబీలో జరిగిన దాడుల్లో పాకిస్తాన్ పౌరుడు మరణించడం బాధ‌క‌ర‌మ‌ని ఎమోషనల్ అయ్యారు. అమాయకులను చంపడం దారుణం అంటూ విమర్శలు చేశారు.

Next Story