- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్ వైమానిక దాడులు.. 10 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య వివాదం రోజు రోజుకు ముదరుతోంది. తాజాగా పాక్ వైమానికదళం.. అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య వివాదం రోజు రోజుకు ముదరుతోంది. తాజాగా పాక్ వైమానిక దళం (Pakistan Air Force).. అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ (Air strikes) చేసింది. ఖోస్త్, కునార్ ప్రావిన్సుల్లోని పాక్ మిస్సైల్స్ దాడి (Pakistani missile attack) చేశాయి. అర్ధరాత్రి జరిగిన ఈ ఆకస్మిక దాడిలో మొత్తం 10 మంది ఆఫ్ఘన్ పౌరులు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ దాడిలో చనిపోయిన మృతుల్లో ఏకంగా 9 మంది చిన్నారులే ఉండటం ఈ ఘటనలోని అత్యంత విషాదకరమైన అంశంగా మారింది. అర్ధరాత్రి పాక్ దొంగదెబ్బ కారణంగా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమయ్యాయి.
ఈ దాడుల వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తమ హెచ్చరికలను లెక్కచేయకపోవడం, ముఖ్యంగా భారతదేశంతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోయింది. ఆఫ్ఘన్ తమను పట్టించుకోకపోవడాన్ని తట్టుకోలేని పాక్, ఈ చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌పై వైమానిక దాడికి ప్రధాన కారణంగా, భారత్‌కు ఆఫ్ఘన్ దగ్గరవుతుండటాన్ని చూపిస్తూ, పాకిస్థాన్ తన ఆగ్రహాన్ని ఈ రాత్రిపూట వైమానిక దాడుల రూపంలో చూపించింది.






