- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ గజబ్ లిల్ హక్ షురూ చేసిన పాక్..58 మంది ఆఫ్ఘాన్ యోధులు మృతి
ఆఫ్ఘన్ దాడుల్లో 55 మంది మృతి చెందిన తర్వాత పాకిస్తాన్ ఆపరేషన్ గజబ్ లిల్ హక్ ప్రారంభించింది.

దిశ, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో భీకర యుద్ధం జరుగుతోంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులకు కౌంటర్ గా మొదట ఆఫ్ఘనిస్తాన్, దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే ఏకంగా పాకిస్తాన్ కు చెందిన 15 ఆర్మీ చెక్ పోస్టులు స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్స్ ప్రకటన చేశారు. ఇక ఈ సంఘటనలో పాకిస్తాన్ కు చెందిన 55 మంది సైనికులు మరణించారని సమాచారం అందుతోంది. ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేసిన నేపథ్యంలో, పాకిస్తాన్ కూడా రివర్స్ ప్రారంభించింది. ఆపరేషన్ గజబ్ లిల్ హక్ ( Operation Ghazab Lil Haq) సైనిక చర్య చేపట్టింది పాకిస్తాన్.
ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరుతో కౌంటర్
డ్యూరాండ్ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది. అయితే ఈ దాడికి కౌంటర్ ఆపరేషన్ గజబ్ లిల్ హక్ షురూ చేసింది పాకిస్తాన్. ఇక ఈ ఆపరేషన్ మొదలు పెట్టిన నేపథ్యంలో మొత్తం 58 మంది ఆఫ్గాన్ యోధులను హతమార్చింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. రాజధాని కాబూల్ పైన కూడా పాకిస్తాన్ అటాక్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. కాందహార్, పక్తియాలోని మిలిటరీ బేస్ ల పైన కూడా విరుచుకుపడింది. అనేక ఆర్మీ పోస్టులను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బకు తాలిబన్ల నెట్వర్క్ భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది.






