భారత్ ధ్వంసం చేసిన ఎయిర్‌బేస్ పునర్నిర్మిస్తోన్న పాక్.. శాటిలైట్ ఫోటోలు వైరల్

by Ramesh Naini |

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ పాకిస్తాన్‌లోని పలు స్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.

భారత్ ధ్వంసం చేసిన ఎయిర్‌బేస్ పునర్నిర్మిస్తోన్న పాక్.. శాటిలైట్ ఫోటోలు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Operation Sindoor) ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ పాకిస్తాన్‌లోని పలు స్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. భారత వైమానిక దాడుల్లో పాక్ ఎయిర్ బేస్‌లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిలో పాక్‌కు ముఖ్యమైన నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ (Nur Khan Airbase) ఒకటి. దాని పునర్మిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇది దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు అత్యంత సమీపంలో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ఉంది. (Rawalpindi) రావల్పిండిలోని ఈ వైమానిక స్థావరం పాక్‌కు కీలకమైంది. పాకిస్తాన్ ఎయిర్ మొబిలిటీ కమాండ్‌కు ఇది ప్రధాన కార్యాలయం. ఈ ఏడాది మే నెలలో భారత్ ఎయిర్‌బేస్‌పై దాడులు జరిపింది. దీంతో ఎయిర్‌బేస్‌లోని రన్‌వేలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని భారత్ ఆర్మీ గతంలో ప్రకటించింది.

దాడి జరిగిన దాదాపు నాలుగు నెలల తర్వాత ఫ్యూహత్మకంగా మళ్లీ పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌ను పునర్నిర్మాణం చేపట్టినట్లు సమచారం. శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే.. దెబ్బతిన్న రన్‌వేలపై మరమ్మత్తు పనులు జరుగుతున్నట్లు కన్పిస్తోంది. అలాగే గోడలు, పునాది పనుల నిర్మాణం జరుగుతున్నట్లు చిత్రాల్లో తెలుస్తోంది. కాగా, పహల్గాం ఉగ్రదాడి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే.

Next Story