కాబూల్ ఆస్పత్రిపై దాడి..ఇండియాకు పాకిస్తాన్ స్ట్రాంగ్ కౌంటర్

by velandi.Saikiran |   (  Updated:2026-03-19 02:40:29  IST  )

కాబూల్ ఆస్పత్రిపై దాడి జ‌రిగిన సంఘ‌ట‌న‌పై..ఇండియాకు పాకిస్తాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Pakistan hits back at India over Kabul strike row
X

Pakistan hits back at India over Kabul strike row

దిశ‌, వెబ్ డెస్క్‌: రెండు రోజుల కిందట ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ ఆసుపత్రిపై (Kabul strike) పాకిస్తాన్ ( Pakistan ) వైమానిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో దాదాపు 400 మంది అమాయకపు ప్రజలు మృతి చెందారు. రంజాన్ కంటే ముందు ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ సంఘటనకు పాల్పడిన పాకిస్తాన్ పై అన్ని దేశాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలో ఇండియా కూడా ఈ దాడిని ఖండించింది. ఇది ప్రాంతీయ సుస్థిరతకు విఘాతం కలిగిస్తుందని.. పాకిస్తాన్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత్ ఇప్పటికే ప్రకటన చేసింది.

ఇండియాకు కౌంటర్ ఇచ్చిన పాకిస్తాన్

కాబూల్ సంఘటనపై ఇండియా ( India ) రియాక్ట్ కావడంపై పాకిస్తాన్ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తమ దేశాన్ని విలన్ గా చూపించేందుకు ప్రతి నిత్యం భారత్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని ఫైర్ అయింది పాకిస్తాన్. ఇందులో భాగంగానే కాబూల్ సంఘటనను ఎత్తి చూపించి తమపై బురద జల్లడం భారత ప్రారంభించిందని మండిపడింది.

ఈ సంఘటన ద్వారా ఆఫ్ఘనిస్తాన్ లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు భారత్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని విమర్శలు చేసింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ పై తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందని పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా కాబూల్ సంఘటనపై ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఏ క్షణమైనా పాకిస్తాన్ పైన రివర్స్ ఎటాక్ చేసే ఛాన్స్ ఉంది.

పాకిస్తాన్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ

Next Story