- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 32 వేల కోట్లు అప్పు వెంటనే కట్టు.. పాక్‌కు UAE హెచ్చరికలు
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్తాన్ కు యూఏఈ మరో ఊహించని షాక్ ఇచ్చింది.

Pakistan is preparing to repay up to $3.5 billion in loans to the United Arab Emirates
దిశ, వెబ్ డెస్క్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్తాన్ కు యూఏఈ మరో ఊహించని షాక్ ఇచ్చింది. తీసుకున్న అప్పు చెల్లించాలంటూ అల్టిమేటం జారీ చేసింది. తామిచ్చిన 3.5 బిలియన్ డాలర్లు వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది యూఏఈ. 1996-97 సమయంలో తీసుకున్న 450 మిలియన్ డాలర్ల అప్పు కూడా ఇందులో ఉంది. ఇలా మొత్తంగా రూ.32 వేల కోట్లు ( ఇండియన్ రూపాయాలలో) యూఏఈకి పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంది.
నెలాఖరులో అప్పు చెల్లించాల్సిందే - యూఏఈ
ఈ ఏప్రిల్ చివరి వరకు తీసుకున్న మొత్తం చెల్లించేందుకు కూడా పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. సెంట్రల్ బ్యాంకులోని రిజర్వుల ద్వారా మూడో విడతల్లో చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఒకవేళ సమయానికి డబ్బులు అడ్జస్ట్ కాకపోయినా అప్పులో సగమైన ఈ నెల ఆఖరు వరకు కట్టే ఛాన్సులు ఉన్నాయి. కాగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ అతలాకుతలం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ఎఫెక్ట్ తో పాకిస్తాన్ చమురు నిల్వలు పూర్తిగా తగ్గాయి. దీంతో ధరలు కూడా పెరిగాయి.
ఇరాన్ అణు ప్లాంట్‌పై క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం!






