జైలులో ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట.. ఏం జరిగిందంటే ?

by Dishanational4 |
జైలులో ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట.. ఏం జరిగిందంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : వివిధ కేసుల ఊబిలో చిక్కుకొని జైలులో మగ్గుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ప్రభుత్వ ఖజానా (తోషా ఖానా)లోని బహుమతులను అక్రమంగా అమ్ముకున్న వ్యవహారంలో గతంలో ఆయనకు 14 ఏళ్ల జైలుశిక్ష పడింది. అయితే దీనిపై పునర్విచారణ కోరుతూ ఇమ్రాన్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో గతంలో దిగువ కోర్టు ఇమ్రాన్‌కు విధించిన 14 ఏళ్ల శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. రంజాన్ పండుగ సెలవుల తర్వాత పిటిషన్‌‌పై విచారణ జరిపి, సాక్ష్యాధారాలను తిరిగి పరిశీలించి తుది తీర్పును వెలువరించే వరకు ఇమ్రాన్ ఖాన్‌, బుష్రా బీబీ దంపతులకు పడిన శిక్షను నిలిపివేస్తున్నట్లు ఇస్లామాబాద్ హైకోర్టు వెల్లడించింది. ఫిబ్రవరి 8 పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. దానికి సరిగ్గా వారం రోజుల ముందు.. ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు జైలు శిక్ష పడింది. 10 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వ పదవిని కూడా చేపట్టకుండా ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు వేసింది. చట్టవిరుద్ధంగా ప్రభుత్వ ఖజానాలోని విదేశీ బహుమతులను విక్రయించారనే ఆరోపణలపై విచారణ జరిపిన దిగువ కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

Next Story

Most Viewed