యుద్ధం ఎఫెక్ట్..పాకిస్తాన్ లో 15 రోజుల పాటు స్కూళ్ల‌కు సెల‌వులు !

by velandi.Saikiran |   (  Updated:2026-03-09 21:15:02  IST  )

యుద్ధం ఎఫెక్ట్.. పాకిస్తాన్ దేశంలో ఉన్న పాఠశాలలకు దాదాపు 15 రోజుల పాటు సెలవులు ఇచ్చారు.

యుద్ధం ఎఫెక్ట్..పాకిస్తాన్ లో 15 రోజుల పాటు స్కూళ్ల‌కు సెల‌వులు !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య దాదాపు పది రోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ ను టార్గెట్ చేసి ఇజ్రాయెల్, అమెరికా దాడులకు తెగబడుతున్నాయి. ఇక అటు ఇరాన్ ఏ మాత్రం తగ్గకుండా, కౌంటర్ ఎటాక్ చేస్తోంది. చర్చలకు కూడా రావడం లేదు ఇరాన్. అయితే ఈ యుద్ధం ప్రభావం ఇతర దేశాల పైన పడుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ కు యుద్ధం కారణంగా తీవ్రస్థాయిలో నష్టం జరుగుతోంది. పాక్ లో పెట్రోల్, డీజిల్ కొర‌త ఏర్ప‌డింది.

యుద్ధం దెబ్బకు పాకిస్తాన్ కఠిన నిర్ణయాలు..!

ఇరాన్ యుద్ధం కారణంగా పాకిస్థాన్ కు గట్టిగానే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. యుద్ధం కారణంగా పాకిస్తాన్ లో చమురు సంక్షోభం ఏర్పడింది. దీంతో పాకిస్తాన్ సర్కార్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ దేశంలో ఉన్న పాఠశాలలకు దాదాపు 15 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. 15 రోజుల వరకు ఎవరు కూడా పాఠశాలలకు రాకూడదని ఆదేశాలు జారీ చేసింది పాకిస్తాన్ సర్కార్.

అయితే ఉన్నత విద్యా సంస్థలలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించారని సూచనలు చేసింది. ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాలో 50% కోతకు కూడా విధించింది పాకిస్తాన్ సర్కార్. 60 శాతం వాహనాలను నడపకూడదని నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎంపీల జీతాలలో కూడా కోత పెట్టింది. ఆఫీసులను వారానికి నాలుగు రోజులు తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. ఉన్న చమురు నిల్వ‌ల‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల‌ని నిర్ణయం తీసుకుంది పాక్ స‌ర్కార్‌.

Next Story