పాక్ వైమానిక దళం ఆకస్మిక దాడి.. 30 మంది మృతి

by Malleboina Mahesh |

పాకిస్తాన్ వైమానిక దళం ఈ రోజు ఉదయం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌పై దాడులు చేసింది. ఈ బాంబుల దాడుల్లో మహిళలు, పిల్లలు సహా కనీసం 30 మంది మరణించినట్లు తెలుస్తుంది.

పాక్ వైమానిక దళం ఆకస్మిక దాడి.. 30 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ వైమానిక దళం (Pakistan Air Force) ఈ రోజు ఉదయం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ (Khyber Pakhtunkhwa Province)పై దాడులు చేసింది. ఈ బాంబుల దాడుల్లో మహిళలు, పిల్లలు సహా కనీసం 30 మంది మరణించినట్లు (30 people died) తెలుస్తుంది. తిరా లోయలో ఉన్న మాత్రే దారా గ్రామంపై పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఎనిమిది LS-6 బాంబులను ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. అయితే పాక్ దాడుల్లో చనిపోయిన వారందరూ ఖైబర్ పఖ్తుంఖ్వా పౌరులే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఎవరూ ఊహించని విధంగా జరిగిన వైమానిక దాడిలో చాలా మంది గాయపడ్డారని స్థానిక మీడియా సంస్థలు నివేదించాయి.

కాగా ఈ దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలలో పిల్లలతో సహా మృతదేహాలు పడి ఉన్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. అలాగే బాంబుల దాడి వల్ల కూలిన శిథిలాల కింద మృతదేహాల కోసం రెస్క్యూ బృందాలు (Rescue teams) వెతుకుతున్నాయి. దీంతో మరణాల సంఖ్య మరింత పెరుగుతుందనే భయాలు పెరిగాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో గతంలో అనేక ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు (Anti-terrorist operations) జరిగాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసుల ప్రకారం, ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య ఈ ప్రావిన్స్ 605 ఉగ్రవాద సంఘటనలను నివేదించింది. ఈ దాడుల్లో కనీసం 138 మంది పౌరులు, 79 మంది పాకిస్తానీ పోలీసు సిబ్బంది మరణించారు.

Next Story