- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Owaisi : కాంగ్రెస్ వల్ల నష్టపోయాం.. లేకుంటే బీహార్ లో 15 సీట్లు గెలిచేవాళ్ళం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఊహించిందే జరిగింది. సర్వేలు అలాగే ఎగ్జిట్ ఫలితాలు కంటే ఎక్కువగానే

దిశ, వెబ్ డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఊహించిందే జరిగింది. సర్వేలు అలాగే ఎగ్జిట్ ఫలితాలు కంటే ఎక్కువగానే ఎన్డీఏ కూటమి సీట్లను సాధించింది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 200 పైగా దక్కించుకొని చరిత్ర సృష్టించింది ఎన్డీఏ. అయితే ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏడు సీట్లు సాధించే ఎంఐఎం పార్టీ బీహార్ లో తన జోరు కొనసాగించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఐదు స్థానాలు దక్కించుకుంది ఎంఐఎం పార్టీ.
జోకిహాట్, బహదుర్గంజ్, కొచ్చధామన్ , అమౌర్, బైసి స్థానాల్లో అసదుద్దీన్ ఓవైసీ పార్టీ విజయం సాధించింది. అభ్యర్థులందరికీ 20 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి నాలుగు స్థానాలు దక్కగా ఈ సారి 29 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ ఐదు స్థానాలు దక్కించుకుంది. అయితే ఈ విజయంపై తాజాగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కారణంగా తాము నష్టపోయామని వెల్లడించారు. ముస్లిం ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చిందని పేర్కొన్నారు. లేకపోతే బీహార్ లో 15 సీట్లు సాధించే వాళ్ళమని ధీమా వ్యక్తం చేశారు ఓవైసీ.






