- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heavy rains: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. కేరళకు ఆరెంజ్ అలర్ట్
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలో తొందరగానే ప్రవేశించిన మే చివరి వారం నుంచి స్తబ్ధుగా మారాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలో తొందరగానే ప్రవేశించిన మే చివరి వారం నుంచి స్తబ్ధుగా మారాయి. దీంతో వర్షాలు కాస్త నెమ్మదించాయి. శుక్రవారం భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించి వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కేరళలో లోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, నాలుగు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 నుంచి 17 వరకు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ వారం ఆరంభం నుంచే కేరళ రాష్ట్రం భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది.
మళ్లీ జోరందుకోనున్న వర్షాలు
ఈ భారీ వర్షాలకు తోడు ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరం, దక్షిణ ఒడిశా పరిధిలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఛత్తీస్ గఢ్, మరాఠా, కర్ణాటక మీదుగా సాగి ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే చివరిలో మందగించిన రుతుపవనాలు మళ్లీ జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ ద్వితీయార్థంలో వర్షాలు మరింత పెరిగే అవకాశముందని IMD అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమాచారం కోసం అధికారిక వాతావరణ సంస్థ సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.






