- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రలో హిందీ తప్పనిసరిపై ప్రతిపక్షాల నిరసన
మహారాష్ట్రలోని స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం హిందీ తప్పనిసరి కాదని జీవోను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మహా వికాస్ అఘాడి (MVA) నాయకులు ముంబైలోని విధాన భవన్ వెలుపల నిరసనకు దిగడంతో సోమవారం శాసనసభ వర్షాకాల సమావేశాలు హై డ్రామా మధ్య ప్రారంభమయ్యాయి.
మరాఠీని అగౌరపరుస్తున్నారు
శివసేన (UBT), కాంగ్రెస్ NCP (శరద్ పవార్ వర్గం) నాయకులు మహాయుతి ప్రభుత్వం మరాఠీ గుర్తింపును అగౌరవపరుస్తోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. పోస్టర్లు ప్రదర్శించారు. శివసేన UBT ఎమ్మెల్యే ఆదిత్య థాకరే, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. 1వ తరగతి నుంచి మరాఠీ, ఇంగ్లీష్ హిందీ మూడు భాషల సూత్రాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకతల నేపథ్యంలో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్న దేవేంద్ర ఫడ్నవీస్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయినా ప్రతిపక్ష పార్టీలు శాంతించలేదు. దీనిపై పూర్తి స్థాయిలో పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






