బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి.. తీవ్రంగా కొట్టి నిప్పంటించిన దుండగులు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-01 13:03:38  IST  )

బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి చేసి నిప్పంటించారు.

బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి.. తీవ్రంగా కొట్టి నిప్పంటించిన దుండగులు
X

దిశ‌, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో మైనారిటీల‌పై దాడులు కొనసాగుతున్నాయి. వరుస దాడులతో అక్కడి మైనారిటీలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఓ వ్యక్తిపై దాడి చేసి అతడికి నిప్పంటించారు. ఈ ఘ‌ట‌న బంగ్లాదేశ్ లోని ష‌రియాత్పూర్ జిల్లాలో జ‌రిగింది. 50ఏళ్ల‌ ఖోక‌న్ దాస్ అనే వ్య‌క్తిపై దాడి చేశారు. ప‌ని నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లిన అత‌డిపై ఓ అల్ల‌రిమూక ప‌దునైన ఆయుధాల‌తో దాడి చేసి నిప్పంటించింది.

ఈ ఘ‌టన‌లో ఖోక‌న్ దాస్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. నిప్పంటించిన తరవాత అతడు పక్కనే ఉన్న చెరువులో దూకి అతడి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇక రెండు రోజుల క్రిత‌మే మైమెన్ సింగ్ లోని భులుకాలో అన్సార్ అనే ర‌క్ష‌ణ క‌మిటీ స‌భ్యుడు బ‌జేంద్ర బిశ్వాస్ ను స‌హోద్యోగి నోమ‌న్ మియా హ‌త్య చేశాడు. అంత‌కుమందు మ‌రో వ్య‌క్తిని అతి దారుణంగా హింసించి చంపేశారు. కొంత‌మంది క‌లిసి వ్య‌క్తిపై దాడి చేసి అత‌డిని కాళ్ల‌తో తొక్కుతూ రాక్ష‌స‌త్వం ప్ర‌ద‌ర్శించారు. అక్క‌డితో ఆగ‌కుండా ఓ చెట్టుకు వేలాడ‌దీశారు. ఈ ఘ‌ట‌న ప్ర‌పంచవ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఇది జ‌నాలు అంద‌రూ చూస్తండ‌గానే జ‌రిగింది. ఇది జ‌రిగిన త‌ర‌వాత సైతం వ‌రుస ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.

Next Story