2028 నుంచి ఇన్ కం ట్యాక్స్ విధించనున్న ఒమన్

by Shamantha N |   (  Updated:2025-06-24 11:27:55  IST  )

2028 సంవత్సరం నుంచి గల్ఫ్ దేశం ఒమన్ లో వార్షిక ఆదాయం 42 వేల ఒమన్ రియల్స్ దాటితే 5 శాతం ట్యాక్స్ విధించనున్నట్లు పేర్కొంది.

2028 నుంచి ఇన్ కం ట్యాక్స్  విధించనున్న ఒమన్
X

దిశ, నేషనల్ బ్యూరో: 2028 సంవత్సరం నుంచి గల్ఫ్ దేశం ఒమన్ లో వార్షిక ఆదాయం 42 వేల ఒమన్ రియల్స్ దాటితే 5 శాతం ట్యాక్స్ విధించనున్నట్లు పేర్కొంది. సంపన్నులను లక్ష్యంగా చేసుకుని ఇన్ కం ట్యాక్స్ ను విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వార్త సంస్థ బ్లూంబర్గ్ తెలిపింది. 42 వేల ఒమన్ రియల్స్ అంటే యూఎస్ డాలర్లలో 1.09 లక్షల వరకు అవుతాయి. ఇప్పటి వరకు ఇక్కడ ప్రవాసులు ఎక్కువ ఉద్యోగాలు చేయడానికి కారణం ఎలాంటి ఇన్ కంట్యాక్స్ లేకపోవడమే అని తెలుస్తోంది.

పెట్రో ఆధారిత ఆదాయం నుంచి బయటపడేలా ప్లాన్..

పెట్రో ఆధారిత ఉత్పత్తుల ఆదాయం నుంచి వేరే ఆదాయ మార్గాలు వెతుకుతూ ఒమన్ ఈ నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లో (GCC) ఆదాయపు పన్ను విధించే తొలి దేశంగా అడుగులు వేస్తోంది. ఒమన్ ఆర్థిక మంత్రి సయీద్ బిన్ మహ్మద్ అల్ సక్రీ ప్రకారం.. ఈ నిర్ణయం ముడి చమురు ఎగుమతులపై దేశానికున్న ఆధారాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజా సేవలపై వ్యయాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. వ్యయ నిధులు, ఆరోగ్య సౌకర్యాలు, సామాజిక అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గల్ఫ్ సహకార మండలిలోని (GCC) ఆరు దేశాలూ ఇప్పటివరకు ఆదాయ పన్ను విధించకపోవడంతో, ఒమన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఫైనాన్షియల్ గా కీలక నిర్ణయం

అబుదాబీలోని కమర్షియల్ బ్యాంక్‌కి చెందిన చీఫ్ ఎకనామిస్ట్ మోనికా మాలిక్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం ఆర్థిక పరంగా చాలా కీలకమని, పన్నుల విధానం ద్వారా ఒమన్ అవసరమైన సంస్కరణలు చేపట్టగలదని వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల్లో ధనికులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాంతీయ పోటీకి భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) కూడా గల్ఫ్ దేశాలు భవిష్యత్తులో ఆదాయపు పన్ను విధించాల్సిన అవసరం ఎదురయ్యే అవకాశముందని సూచించింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగం తగ్గుతుండటంతో, ఆయిల్ ఆధారిత ఆదాయాన్ని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బహుశా గల్ఫ్ దేశాల్లో ప్రభుత్వాలు ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ సౌదీ అరేబియా, బహ్రెన్ లలో బడ్జెట్ లో లోపాలు కనిపిస్తున్నాయి.

ఒమన్ భవిష్యత్తు కోసమే ఇలా..

ఒమన్ కొన్ని సంవత్సరాలుగా భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తోంది. ఆస్తుల అమ్మకాలు, ప్రైవేటీకరణ ద్వారా నిధులను సమకూర్చుకుంటోంది. ఒమన్ 2023లో ప్రభుత్వానికి చెందిన ఇంధన సంస్థను పబ్లిక్ లిస్టింగ్ చేయడం ద్వారా రూ. 2 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను సమీకరించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఒమన్ తీసుకున్న ఈ నిర్ణయం మిగతా గల్ఫ్ దేశాలు కూడా అనుసరించే సమయం దగ్గరలోనే ఉన్నట్లు అర్థమవుతోంది.

Next Story