- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
40ఏళ్లుగా కడుపులో బిడ్డను మోస్తున్న 84ఏళ్ల వృద్ధురాలు..
కొలంబియాలో ఓ వింత ఘటన బయటకొచ్చింది. 2013లో బోగోటా నగరంలో నివసిస్తున్న 84ఏళ్ల వృద్ధురాలు కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లింది. మొదట డాక్టర్లు స్టమక్ ఇన్‌ఫెక్షన్ ఉందని ఎక్స్‌రే తీశారు.

దిశ, వెబ్ డెస్క్ : కొలంబియాలో ఓ వింత ఘటన బయటకొచ్చింది. 2013లో బోగోటా నగరంలో నివసిస్తున్న 84ఏళ్ల వృద్ధురాలు కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లింది. మొదట డాక్టర్లు స్టమక్ ఇన్‌ఫెక్షన్ ఉందని ఎక్స్‌రే తీశారు. అప్పుడే షాకింగ్ విషయాన్ని గుర్తించారు. ఆమె శరీరంలో 40ఏళ్లుగా ఓ బేబీ ఉందని గుర్తించారు. ఇది కఠినమైన గర్భం లేదా కాల్సిఫైడ్ ఫెటస్ అని.. చనిపోయిన బిడ్డ అలాగే ఉందని తెలిపారు.
దీన్నే ‘లిథోపెడియన్’ లేదా ‘స్టోన్ బేబీ’ అని అంటారు. ఇది చాలా అరుదైన పరిస్థితి. నార్మల్‌గా గర్భాశయంలో గర్భం ఏర్పడుతుంది. కానీ కొన్నిసార్లు ట్యూబ్‌లో ఫెటస్ పెరుగుతుంది. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ మహిళకు దాదాపు 40 ఏళ్ల క్రితం ట్యూబ్‌లో బేబీ పెరిగింది. 14 వారాల తర్వాత హార్ట్ బీట్ లేకపోవడంతో చనిపోయింది. కానీ అప్పటికీ తాను గర్భవతిని అని, గర్భం పోయిందని తెలుసుకోలేకపోయింది. దీంతో శరీరం దాన్ని కాల్సియంతో కప్పేసి.. ఇన్ఫెక్షన్ రాకుండా రక్షించుకుంది. ఆ గర్భం అలాగే కఠినంగా మారిపోయి.. అక్కడే ఉండిపోయింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 400 ఏళ్లలో కేవలం 300 మాత్రమే ఇలాంటి కేసులు రికార్డ్ అయ్యాయి.






