కాల్పుల విరమణ ఒప్పందం.. భారీగా తగ్గిన చమురు ధరలు

by Naga Rani Yarlagadda |

ఇరాన్ పై ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించడంతో చమురు ధరలు అమాంతం పడిపోయాయి.

కాల్పుల విరమణ ఒప్పందం.. భారీగా తగ్గిన చమురు ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ చమురు మార్కెట్లో సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో అమెరికా ముడిచమురు (WTI Crude) ధరలు ఏకంగా 13 శాతం మేర పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ కు 95.06 డాలర్లకు పడిపోయింది. దీంతో అమెరికా మార్కెకాల్పుల విరమణ ఒప్పందం.. భారీగా తగ్గిన చమురు ధరలుట్లు పుంజుకున్నాయి. డౌ ఫ్యూచర్స్ 900 పాయింట్లు ఎకబాకింది. అయితే.. చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, పరిస్థితులు వెంటనే చక్కబడతాయని తాము భావించడం లేదని వెస్ట్‌పాక్ బ్యాంకింగ్ కార్ప్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ రాబర్ట్ రెన్నీ అభిప్రాయపడ్డారు.

ట్రంప్ ‘సీజ్‌ఫైర్’ (Trump Cease Fire) ప్రకటనతో ఊరట ఇరాన్‌లోని పౌర మౌలిక సదుపాయాలపై బాంబు దాడులు చేస్తామని ఇదివరకు హెచ్చరించిన ట్రంప్, తాజాగా ఆ నిర్ణయంపై రెండు వారాల పాటు విరామం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలతో గడువు ముగియనున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందించిన ట్రంప్.. ఇది ‘డబుల్ సైడెడ్’ సీజ్‌ఫైర్ అని పేర్కొన్నారు. అయితే.. దీనికి ప్రతిగా ఇరాన్ వెంటనే ‘హోర్ముజ్ జలసంధి’ని సురక్షితంగా పునరుద్ధరించాలని ఆయన షరతు విధించగా.. అందుకు ఇరాన్ అంగీకరించింది.

Next Story