జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం

by Disha Web Desk 2 |
జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యాధునిక అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా ఐదేళ్ల తర్వాత తొలిసారి మంగళవారం జపాన్‌ మీదుగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దీనితో ఉత్తర జపాన్‌లో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని దేశ ప్రజలను జపాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. క్షిపణి పసిఫిక్ మహాసముద్రంలో పడకముందే తన భూభాగం మీదుగా ఎగిరినట్లు కనిపించడంతో జపాన్ ప్రభుత్వం పౌరులను కవర్ చేయాలని హెచ్చరించింది. 2017 తర్వాత ఉత్తర కొరియా ప్రయోగించిన మొదటి క్షిపణి ఇదే. ఈ ప్రయోగాన్ని జపాన్ ప్రధాని కిషిదా ఖండించారు. అయితే, క్షిపణిని కూల్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని టోక్యో తెలిపింది. ఉత్తర కొరియా నుండి పదేపదే క్షిపణి ప్రయోగాలు జరుగుతున్న నేపథ్యంలో జపాన్ తన రక్షణ సిబ్బందిని అప్రమత్తం చేసింది. దక్షిణ కొరియా కూడా తమ మిలిటరీకి కీలక సూచనలు చేసింది. మిత్రదేశాల సహకారాన్ని పెంచుకుంటామని చెప్పింది.


Next Story

Most Viewed